కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్న వొడాఫోన్-ఐడియా

ప్రముఖ టెలికాం సంస్థ, దేశంలోనే మూడో అతి పెద్ద ఆపరేటర్‌ అయిన వొడాఫోన్‌-ఐడియా లిమిటెడ్‌ కీలక ప్రకటన చేసింది. వొడాఫోన్‌  ఐడియా మెజార్టీ వాటా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ఈక్విటీలుగా మార్చే ప్రక్రియలో భాగంగా సుమారు 36% షేర్లు కేంద్రానికి అప్పగించినట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్య ద్వారా.. కంపెనీలోని మేజర్‌ వాటాను ప్రభుత్వానికి అప్పగించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

కస్టమర్లను భారీగా కోల్పోతుండటం.. లాభదాయక పరిస్థితులు కనిపించక పోవడం.. పెరిగిపోతున్న అప్పుల కారణంగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు.. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ వాటాకు అంగీకారం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని తెలిపింది కంపెనీ. కంపెనీ బకాయిలను ఈక్విటీగా మార్చిన తర్వాత వొడాఫోన్ ఐడియాలో 35.8 శాతం వాటా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది.

యూకేకు చెందిన వొడాఫోన్‌ గ్రూప్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ 28.5 శాతం కలిగి ఉండగా, కుమార మంగళం బిర్లా ఆధ్వర్యంలోని ఆదిత్యా బిర్లా గ్రూప్‌ 17.8 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 36 శాతం వాటాతో నిర్ణయాలలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం కంపెనీ షేర్‌హోల్డర్లందరికీ షాక్ ను కలిగించింది. ఈ కీలక పరిణామం తర్వాత మంగళవారం నాటి స్టాక్‌ సూచీల్లో వొడాఫోన్‌ ఐడియా షేర్లు 19 శాతం పడిపోవడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =