భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతీయ రైతుల సహకారాన్ని గౌరవిస్తూ.. దేశంలో వారి ప్రాముఖ్యతను కీర్తించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలాగే, ఈ రోజున అవిశ్రాంతంగా పని చేస్తున్న అన్నదాతలకు దేశం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ సంవత్సరం, మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుపై పోరాటంలో సఫలీకృతులైన నేపథ్యంలో రైతులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2001లో, భారత ప్రభుత్వం డిసెంబర్ 23ని చౌదరి చరణ్ సింగ్ జన్మించిన ఈ రోజును జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. కిసాన్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం, రైతుల సమస్యలు, వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు, నూతన సాంకేతికత, పంటల విధానం, సాగులో మార్పులు వంటి అనేక అంశాలపై అర్థవంతమైన చర్చ జరుగుతోంది.
చౌదరి చరణ్ సింగ్
భారతదేశం వ్యవసాయ దేశంగా చెబుతారు. నేటికీ దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయం లేదా అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు. రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి చౌదరి చరణ్ సింగ్ చేసిన కృషిని గుర్తించేందుకు 2001లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చరణ్ సింగ్ వ్యవసాయ రంగంలో కొన్ని అద్భుతమైన సంస్కరణలను తీసుకువచ్చాడు. అందుకే ఆయనను చాలా మంది చరిత్రకారులు ‘భారత రైతుల ఛాంపియన్’ అని పిలుస్తారు. అన్నదాతల ప్రయోజనాల కోసం, వ్యవసాయం కోసం అతను అనేక ముఖ్యమైన పనులు చేసాడు. దేశ ప్రధానిగా ఉన్న కాలంలో చౌదరి చరణ్ సింగ్ రైతులు, వ్యవసాయ రంగ అభ్యున్నతిలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని రైతు కుటుంబంలో డిసెంబర్ 23, 1902 న జన్మించాడు. ఆయన ఆయన మహాత్మా గాంధీ అడుగుజాడలలో నడిచారు. చరణ్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై కూడా పోరాడాడు. స్వాతంత్య్రానంతరం రైతుల ప్రయోజనాల కోసం కృషి చేయడం ప్రారంభించారు. అతని రాజకీయాలు ప్రధానంగా గ్రామీణ భారతదేశం, రైతు, సామ్యవాద సూత్రాలపై దృష్టి సారించాయి. ఉత్తరప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణల అమలులో ప్రధాన భూమిక పోషించి రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. దేశ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ జమీందారీ వ్యవస్థను అంతమొందించేందుకు ఎనలేని కృషి చేశారు. చరణ్ సింగ్ 1979 మరియు 1980 మధ్య ప్రధాని పదవిని నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ








































