23 రోజుల నుంచి కర్ణాటకలో సాగుతున్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసింది. నిన్న జరిగిన బలపరీక్షతో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 14 నెలల పాటు సాగిన ఈ ప్రభుత్వ పరిపాలన అనేక ఆటుపోట్లను ఎదురుకుంది, 15 మంది కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేల రాజీనామాల తరువాత కుమారస్వామి యే విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. చివరి వరకు అసమ్మతి ఎమ్మెల్యేలు వస్తారని ఎదురుచూసిన ప్రయోజనం దక్కలేదు,బల పరీక్ష నిర్వహించడానికి గవర్నర్ విధించిన రెండు గడువులను కోల్పోయిన తరువాత, జూలై 23 న,కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎట్టకేలకు ఓటింగ్ నిర్వహించారు.
గత 23 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం చివరకు బిజెపి విజయంతో ముగిసింది. 6 ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సభలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు, స్పీకర్ ను మినహాయించి 204 మంది సభ్యులు ఉన్నారు. జెడిఎస్ మరియు కాంగ్రెస్ కూటమికి 99 ఓట్లు, బిజెపికి 105 ఓట్లు వచ్చాయని, 6 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచింది అని ఓటింగ్ తరువాత స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ వరకు నడుచుకుంటూ వెళ్లి, కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాళా కి రాజీనామా సమర్పించారు.
కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడం ప్రజాస్వామ్య విజయమని ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పచెప్పారు,పార్టీ అధ్యక్షుడిని సంప్రదించి, గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్ణాటకను అభివృద్ధిని చేస్తామని తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=B3KNf8ebk3s]