బీసీసీఐ సెలక్షన్ కమిటీ పై గంగూలీ కామెంట్స్

BCCI Selection Committee Updates, Mango News, Saurav Ganguly questions BCCI for selection process, Sourav Ganguly About selection committee, Sourav Ganguly Comments On BCCI Selection Committee, Sourav Ganguly Latest News, Sourav Ganguly questions BCCI CoA decision to change eligibility, Sourav Ganguly surprised by absence of Shubman Gill

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసాడు. ఇటీవలే సెలక్షన్ కమిటీ ఆగస్ట్ 3 నుంచి జరగబోయే వెస్టిండీస్ సిరీస్ కి భారత టెస్టు, వన్డే, టీ20 జట్టులను ప్రకటించింది. అయితే వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేసిన జట్ల ఫై సౌరవ్ గంగూలీ ట్విట్టర్లో స్పందించాడు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న శుభమన్ గిల్ కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్యే రహానే వంటి బ్యాట్సమెన్ ను టెస్టులకే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసాడు. మూడు ఫార్మాట్లకు సంబంధించి ఒకే ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అవకాశం ఇవ్వాలని కోరారు.

సౌరవ్ గంగూలీ ట్విట్టర్లో స్పందిస్తూ, ‘ బీసీసీఐ సెలెక్టర్లు,మంచి ప్రదర్శన మరియు విశ్వాసం కోసం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్లలో ఒకే ఆటగాళ్లను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది, చాలా తక్కువ మంది ఆటగాళ్లు మాత్రమే అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు, గొప్ప జట్లలో ఆటగాళ్ళు స్థిరంగా ఉంటారు, జట్టు ఎంపిక అందరినీ సంతోషపెట్టడం గురించి కాదు, దేశం కోసం ఆడేందుకు ఉత్తమ జట్టును అందివ్వాలి ‘ అన్నారు. అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు ఆడగల ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉన్నారు, వన్డే జట్టులో అజింక్యే రహానే, శుభమన్ గిల్ లాంటి ఆటగాళ్లకు చోటు దక్కక పోవడం ఆశ్యర్యంగా ఉందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here