విద్యార్థిని ఫిర్యాదుకు స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి

Energy Minister of MP, Girl Student Complains Of Dirty Toilet in Govt School, Madhya Pradesh, Madhya Pradesh Minister Cleans Toilet At Government School, Madhya Pradesh minister cleans toilet at government school in Gwalior, Madhya Pradesh Minister Pradhuman Singh Tomar, Madhya Pradesh Minister Pradhuman Singh Tomar Cleans Toilet At Government School, Mango News, Mango News Telugu, Minister Cleans Toilet, Minister of Madhya Pradesh cleans toilet, Minister Pradhuman Singh Tomar Cleans Toilet At Government School, MP Min Pradhuman cleans govt school toilet, Pradhuman Singh cleans Toilet

రాజకీయ నాయకులు అంటే ప్రస్తుత సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. వారు ఎన్నికల సమయంలోనే కనిపిస్తారు, ప్రజలకు అందుబాటులో ఉండరు అని చాలామంది భావన. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నికలప్పుడు మాత్రమే వస్తారు, ఆ తర్వాత వారికి జనం సమస్యలు పట్టవు అని అనుకుంటూ ఉంటారు. కానీ, అందరు రాజకీయ నాయకులు ఒకేలా ఉండరు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై స్పందించే నాయకులూ ఉన్నారు. అలాంటి ఓ నాయకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మంత్రే స్వయంగా

మధ్యప్రదేశ్ లో, ఓ ప్రభుత్వ పాఠశాలలోని టాయిలెట్స్ ని స్వయంగా శుభ్రం చేసిన ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తమ పాఠశాలలోని టాయిలెట్స్ క్లీన్ గా లేవని, దాని వలన విద్యార్థులు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక బాలిక నాతో చెప్పింది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. పరిసరాల ప్రతిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, అందుకే స్పందించాను అని మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ చెప్పారు. అధికారులకు చెప్పకుండానే మంత్రే స్వయంగా వచ్చి టాయిట్స్ శుభ్రం చేశారు.

ఈ హఠాత్పరిణామంతో పాఠశాల సిబ్బంది అవాక్కయ్యారు. విషయం తెలుసుకుని ఉరుకులు, పరుగులతో అక్కడికి చేరుకున్న మున్సిపల్ అధికారులను.. పాఠశాలల్లోని  మరుగుదొడ్లను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా, ఆయన  మాట్లాడుతూ.. “నేను 30 రోజుల పరిశుభ్రత ప్రతిజ్ఞ చేసాను. నేను ప్రతి రోజు ఏదో ఒక కార్యాలయానికి వెళ్లి దానిని శుభ్రం చేస్తాను. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నాను,” అని మంత్రి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ