నేడే గుజరాత్ vs రాజస్థాన్ ఐపీఎల్ ఫైనల్‌.. హాజరు కానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బాలీవుడ్ స్టార్స్

IPL Final 2022 GT vs RR Union Home Minister Amit Shah and Several Bollywood Stars To Attends The Match Today, Union Home Minister Amit Shah and Several Bollywood Stars To Attends The IPL Final Match Today, Union Home Minister Amit Shah To Attends The IPL Final Match Today, Several Bollywood Stars To Attends The IPL Final Match Today, IPL Final 2022 GT vs RR, Rajasthan Royals, Gujarat Titans, IPL-2022 Final Match, 2022 IPL Final Match, IPL-2022, TATA IPL 2022, 2022 TATA IPL, Tata IPL, Indian Premier League, Indian Premier League News, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, Indian Premier League Live Updates, Cricket, Cricket Latest News, Cricket Live Updates, Mango News, Mango News Telugu,

గత కొన్ని వారాలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీనికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. లీగ్ దశలో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఇప్పుడు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈరోజు జరుగనున్న ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సీజన్‌లో రెండు జట్లు మూడోసారి తలపడనున్నాయి. లీగ్ దశలో టైటాన్స్ 10 మ్యాచ్‌లు గెలిచి 20 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి తమ తొలి సీజన్‌లోనే ఫైనల్‌కు చేరుకుంది. ఇంకోవైపు రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2లో బెంగళూరుపై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన ఐపీఎల్, ఈసారి భారీ ప్రేక్షకుల మధ్య అద్భుతంగ సాగింది. అందుకే ఈసారి ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సంబరాలను జరపడానికి బీసీసీఐ నిర్ణయించుకుంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులను ఈ ముగింపు వేడుకకు ఆహ్వనించారు. ఈ వేడుకలకు రణవీర్ సింగ్ మరియు ఏఆర్ రెహమాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై 50 నిమిషాల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. అనంతరం రాత్రి 7:30 గంటలకు టాస్‌ వేయనుండగా, 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మరోవైపు ఫైనల్స్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లు కోసం సుమారు 6,000 మంది పోలీసులను మోహరించారు. ఐపీఎల్‌లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఎవరూ ఊహించని విధంగా ఫైనల్‌లో అడుగు పెట్టడం విశేషం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ సారధ్యంలో లీగ్ దశలో అద్భుతంగ ఆది ఫైనల్‌కు చేరుకుంది. రెండు జట్లు సమ ఉజ్జీగా ఉండటంతో ఫైనల్ మ్యాచ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. రెండు జట్ల లోని ఫామ్ లో ఉండటంతో భారీ స్కోర్లు ఖాయంగానే కనిపిస్తోంది. హోరాహోరీగా జరుగనున్న ఫైన మ్యాచ్‌లో చివరికి టైటిల్ గెలిచేదెవరో చూడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఫైనల్ మ్యాచ్ తుది జట్లు (అంచనా)

గుజరాత్‌

హార్దిక్‌ (కెప్టెన్‌), గిల్‌, సాహా, వేడ్‌, మిల్లర్‌, తెవాటియా, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌, అల్జారీ జోసెఫ్‌, యష్‌ దయాల్‌, షమీ.

రాజస్థాన్‌

శాంసన్‌ (కెప్టెన్‌), బట్లర్‌, జైస్వాల్‌, పడిక్కల్‌, హెట్‌మైర్‌, పరాగ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, చాహల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మెక్‌కాయ్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here