కోవావాక్స్​ కి ఆమోదం తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

COVID 19 Vaccine, Covovax, Covovax Covid-19 Vaccine, India’s Covovax Vaccine, India’s Covovax Vaccine Bags WHO’s Approval, Mango News, Novavax’s Covovax vaccine gets WHO’s emergency use, SII’s Covovax COVID-19 vaccine, SII’s Covovax COVID-19 vaccine approved, SII’s Covovax COVID-19 vaccine approved for emergency use, WHO Approves Covid-19 Vaccine Covovax, WHO Approves Covid-19 Vaccine Covovax For An Emergency Usage, WHO approves emergency use listing for Serum Institute vaccine, WHO approves emergency use of Covid-19 vaccine Covovax

కరోనా.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఇది వచ్చినప్పటినుంచీ కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తలు చేయని ప్రయత్నం లేదు. దీనిపై ప్రయోగించేందుకు ప్రవపంచవ్యాప్తంగా అనేక రకాల మందులు కనిపెట్టారు. అయినా సరే, కరోనాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టలేకపోతున్నారు. అయితే, తాజాగా పుణేకు చెందిన సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి రానుంది. దీనికి కోవావాక్స్​ (COVAVAX) అని పేరు పెట్టారు.

అమెరికాకు చెందిన నోవావాక్స్​ భాగస్వామ్యంతో భారతీయ సంస్థ సీరమ్​ ఉత్పత్తి చేస్తున్న కోవావాక్స్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదముద్ర వేసింది. ఈ వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్​ (WHO) అనుమతినిచ్చింది. దీంతో, త్వరలోనే ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి రానుంది. కోవావాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతించిన నేపఫథ్యంలో, సీరమ్​ CEO అదర్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారి​పై పోరాటంలో ఇది మరో మైలురాయి అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా దిగ్గజ కంపెనీ నోవావాక్స్​ తో కలిసి సీరమ్​ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తోంది. ఈ సంవత్సరం మొదట్లోనే ఈ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు నిర్వహించింది నోవావాక్స్​. ఇది కొవిడ్​పై 96.4 శాతం ప్రభావవంతగా పని చేసినట్లు తేలింది. ఒక్క డోసు ద్వారానే 83.4 శాతం ప్రభావశీలత కనిపించినట్లు అప్పట్లో వెల్లడించింది నోవావాక్స్. పేద దేశాల్లో టీకా వినియోగాన్ని పెంచేందుకు ఈ వ్యాక్సిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అనుమతి మంజూరు చేసింది. అత్యవసర వినియోగం కోసం డబ్ల్యూహెచ్​ఓ అనుమతించిన 9వ వ్యాక్సిన్​ ఇది. భారత్​లో ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్, రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్​లు వినియోగంలో ఉన్నాయి. కొవిషీల్డ్​ను కూడా సీరమ్​ సంస్థే తయారుచేయటం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =