టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టు ఇదే…

5 Member Squad for ICC Men’s T20 World Cup-2021, Aussie stars return as rookie earns T20 World Cup, Australia announce 15-member squad for T20 World Cup, Australia Announces 15 Member Squad, Australia Announces 15 Member Squad for ICC Men’s T20 World Cup-2021, Australia announces 15-man squad for T20 World Cup, ICC Men’s T20 World Cup 2021, ICC T20 World Cup, ICC T20 World Cup 2021, Mango News, T20 World Cup, T20 World Cup-2021

టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం ఆటగాళ్ల జాబితాపై అన్ని కీలక క్రికెట్ బోర్డులు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో గురువారం నాడు టీ20 ప్రపంచకప్‌ లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియా నేషనల్ సెలెక్షన్ ప్యానెల్ టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడా జట్టును ప్రకటించింది.

ఈ జట్టుకు ఆరోన్ పించ్ కెప్టెన్‌ గా, పాట్‌ కమిన్స్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాళ్లు అయిన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌ జట్టులోకి వచ్చారు. మరోవైపు బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటిన జోష్ ఇంగ్లిస్ కి ఆస్ట్రేలియా జట్టులో చోటు లభించింది. వెస్ట్ ఆస్ట్రేలియాకు చెందిన అన్ క్యాపెడ్ ప్లేయర్ జోష్ ఇంగ్లిస్ ను మాథ్యూ వేడ్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా మరియు టాప్, మిడిల్ ఆర్డర్‌లలో ప్రభావం చూపే బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇక ఆస్ట్రేలియా టీ20 జట్టు సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో యూఏఈకి బయలుదేరి వెళ్తుందని తెలిపారు.

టీ20 ప్రపంచ కప్-2021 కు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టు :

  1. ఆరోన్ ఫించ్ (కెప్టెన్)
  2. అష్టన్ అగర్
  3. పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్)
  4. జోష్ హాజెల్‌వుడ్
  5. జోష్ ఇంగ్లిస్
  6. మిచెల్ మార్ష్
  7. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌
  8. కేన్ రిచర్డ్ సన్
  9. స్టీవ్ స్మిత్
  10. మిచెల్ స్టార్క్
  11. మార్కస్ స్టోయినిస్
  12. మిచెల్ స్వీప్సన్
  13. మాథ్యూ వేడ్
  14. డేవిడ్ వార్నర్
  15. ఆడమ్ జాంపా
  16. ట్రావెలింగ్ రిజర్వ్స్ : డాన్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డేనియల్ సామ్స్.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =