మహారాష్ట్రలో మంత్రుల శాఖల ఖరారు

Congress Revenue, latest political breaking news, Maharashtra Cabinet, Maharashtra Political News, Maharashtra Political Updates, Mango News Telugu, national news headlines today, national news updates 2019, National Political News 2019, NCP Finance, Shiv Sena Gets Home

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలో మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ థాకరే తో
పాటుగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12, గురువారంనాడు కూటమిలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు సమావేశమై మంత్రి పదవుల పంపకం, మంత్రులకు శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన హోం మంత్రిత్వ శాఖతో పాటు నగరాభివృద్ధి శాఖలు శివసేన దక్కించుకోగా, ఎన్సీపీకి ఆర్థికశాఖ, గృహనిర్మాణం, వైద్యం, నీటిపారుదల శాఖలను కేటాయించారు. అలాగే కాంగ్రెస్‌కు రెవెన్యూ, విద్యుత్‌, విద్య, టెక్స్‌టైల్‌, మహిళా శిశు సంక్షేమ శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

శివసేన
ఏక్‌నాథ్‌ షిండే: హోం, పట్టణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, నీటి సరఫరా, నీటిపారుదల, పర్యాటక రంగం, పిడబ్ల్యుడి, పార్లమెంటరీ వ్యవహారాలు
సుభాష్ దేశాయ్: పరిశ్రమలు, ఉన్నత, సాంకేతిక విద్య, మైనింగ్, క్రీడలు, యువజన అభివృద్ధి
ఎన్సీపీ
జయంత్ పాటిల్: ఆర్ధిక, ప్రణాళిక, గృహ నిర్మాణ, ఆహార సరఫరాలు, కార్మిక శాఖ
చగన్ భుజ్‌బాల్‌: గ్రామీణాభివృద్ధి, జల వనరులు, సామాజిక న్యాయం, ఎక్సైజ్, ఎఫ్‌డిఎ
కాంగ్రెస్
నితిన్ రావత్: గిరిజన, ఓబిసి అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ,విపత్తు శాఖ
బాలసాహెబ్ తోరట్: రెవెన్యూ, విద్యుత్, వైద్య విద్య, పాఠశాల విద్య, పశుసంవర్ధక, డైరీ అభివృద్ధి, మత్స్యశాఖ

[subscribe]