మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూన్ 20, ఆదివారం కూడా 9,361 కరోనా కేసులు, 190 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,72,781 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,17,761 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,101 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 57,19,457 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.97 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,32,241 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 3,95,14,858 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ