తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 30,946 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 5,954 శాంపిల్స్ పరీక్షించగా 4,544 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 918, రంగారెడ్డిలో 125, సంగారెడ్డిలో 79, మేడ్చల్ లో 67, వరంగల్ అర్బన్ లో 34, కరీంనగర్ లో 32, భద్రాద్రి కొత్తగూడెంలో 23, నల్గొండలో 21, నిజామాబాద్ లో 18, మెదక్ లో 17, ఖమ్మంలో 12, సూర్యాపేటలో 10 నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వివరాలు (జూలై 9, సాయంత్రం 5 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 30,946
కొత్తగా నమోదైన కేసులు (జూలై 8- జూలై 9 (5PM-5PM) : 1410
నమోదైన మరణాలు : 7
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 18,192
యాక్టీవ్ కేసులు : 12,423
మొత్తం మరణాల సంఖ్య : 331
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu