రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసినట్టు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ సోమవారం నాడు ప్రకటించారు. “మహారాష్ట్రలో ప్రస్తుత కరోనా పరిస్థితిని బట్టి 10 మరియు 12 వ తరగతికి స్టేట్ బోర్డు పరీక్షలను వాయిదా వేశాం. ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వహించడానికి అనుకూలంగా లేవు. విద్యార్థుల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ప్రొఫెషనల్ కోర్సులకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని 12 వ తరగతి పరీక్షలు మే చివరి నాటికి నిర్వహిస్తాం. అలాగే 10వ తరగతి పరీక్షలు జూన్‌లో జరుగుతాయి. కరోనా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ పరీక్షలు నిర్వహించే తేదీలు తదనుగుణంగా ప్రకటించబడతాయి” విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు.
అదేవిధంగా సిబిఎస్ఇ, ఐసిఎస్ఇ, ఐబి, కేంబ్రిడ్జ్ బోర్డులకు కూడా వారు ప్రకటించిన పరీక్షల తేదీలను పునఃపరిశీలించమని లేఖ రాసి కోరతామని చెప్పారు. మరోవైపు కరోనా పరిస్థితుల దృష్ట్యా మహారాష్ట్రలోని 1 వ తరగతి నుండి 9 వతరగతి వరకు మరియు 11 తరగతి విద్యార్థులందరూ ఎటువంటి పరీక్షలు లేకుండా తదుపరి తరగతికి ప్రమోట్ చేయబడతారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ