ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ కు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రకటన

Legendary actress Asha Parekh to be Honoured with Dadasaheb Phalke Award, Dadasaheb Phalke Award, Legendary actress Asha Parekh, Actress Asha Parekh, Legendary actress Asha Parekh will receive the Dadasaheb Phalke Award for the year 2020, Dadasaheb Phalke Award for the year 2020, Asha Parekh, National Film Award ceremony, Ministry of Information and Broadcasting, Actress Asha Parekh News, Actress Asha Parekh Latest News And Updates, Actress Asha Parekh Live Updates, Mango News, Mango News Telugu

ప్రముఖ నటి, దర్శకురాలు మరియు నిర్మాత ఆశా పరేఖ్‌ కు 2020 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి గాను ఆశా పరేఖ్‌ ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ట్విట్టర్లో ప్రకటించారు. “దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ భారతీయ సినిమాకు ఆశా పరేఖ్ జీ చేసిన ఆదర్శప్రాయమైన జీవితకాల సేవను గుర్తించి, అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించడానికి గౌరవంగా ఉంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 30న జరిగే 68వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశా పరేఖ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేస్తారు” అని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

ఆశా పరేఖ్ ప్రఖ్యాత సినీ నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా మరియు నిష్ణాతులైన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణిగా గుర్తింపు పొందారు. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె దిల్ దేకే దేఖోలో కథానాయికగా అరంగేట్రం చేసింది మరియు మొత్తం 95 చిత్రాలలో నటించింది. ఆమె కటి పతంగ్, తీస్రీ మంజిల్, లవ్ ఇన్ టోక్యో, అయా సావన్ ఝూమ్ కే, ఆన్ మీలో సజ్నా, మేరా గావ్ మేరా దేశ్ వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఆశా పరేఖ్ ను 1992లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అలాగే 1998-2001 మధ్య ఆమె సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హెడ్‌గా కూడా పనిచేశారు. ఇక 52వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కోసం జ్యూరీలో చలనచిత్ర పరిశ్రమ నుండి ఆశా భోంస్లే, హేమ మాలిని, పూనమ్ ధిల్లాన్, టీ.ఎస్ నాగాభరణ, ఉదిత్ నారాయణ్ వంటి సభ్యులు ఉన్నారు. ఈ ఐదుగురు సభ్యుల జ్యూరీ బృందం ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కేఅవార్డును ప్రదానం చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here