సినిమా హాళ్లలో 100 శాతం ప్రేక్షకుల అనుమతికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్

100% Capacity in Cinema Theaters, Mango News Telugu, MHA Asks Tamil Nadu Govt to Withdraw Orders, Tamil nadu 100% Capacity in Cinema Theaters, Tamil Nadu Cinema Theaters, Tamil Nadu Govt, Tamil Nadu Govt to Withdraw Orders over Allowing 100% Capacity in Cinema Theaters, Tamil Nadu latest news, Tamil Nadu Movie Theaters, Tamil Nadu News

సినిమా థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌ లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుండి 100 శాతం వరకు పెంచేందుకు అనుమతిస్తూ ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీటింగ్ సామర్ధ్యం పెంపుపై తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ బ్రేక్ వేసింది. ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు తమిళనాడు సీఎస్ కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా బుధవారం నాడు లేఖ రాశారు.

దేశంలో కరోనా మహమ్మారి నియంత్ర‌ణ కోసం గత నవంబర్ 25న జారీచేసిన మార్గదర్శకాలు జనవరి 31, 2021 వరకు అమల్లో ఉంటాయని, వాటిని ఉల్లంఘించకూడదని లేఖలో పేర్కొన్నారు. ఆ నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లకు 50% సామర్థ్యంతో తెరవడానికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 6 =