24 గంటల్లో 2936 కరోనా పాజిటివ్ కేసులు, 50 మరణాలు నమోదు

Maharashtra Reports 2936 New Covid-19 Cases and 50 Deaths Today

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 12, బుధవారం నాడు 2936 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,74,488 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 50,151 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 3282 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 18,71,270 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.77 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.54 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం కేరళ (64554) మరియు మహారాష్ట్ర (51,892) రాష్ట్రాల్లో మాత్రమే 50 వేలకంటే ఎక్కువ యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మంగళవారం నాటికి రాష్ట్రంలో 1,35,00,734 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ