జనవరి 26 నుంచి మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం: మంత్రి తలసాని

Fisheries Department, Latest News on talasani srinivas yadav, Mango News Telugu, Minister Talasani Srinivas, Minister Talasani Srinivas Yadav, Minister Talasani Srinivas Yadav held Meeting with Officials, Talasani Srinivas, talasani srinivas yadav, Telangana Fisheries Department, Telangana Fisheries Department News, Telangana Fisheries Department Updates

జనవరి 26 వ తేదీ నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్, గంగపుత్రులు, తెనుగు, గుండ్ల బెస్త, బెస్త, ముతరాసి తెగలకు చెంది 18 సంవత్సరాల వయసు దాటిన వారిని అర్హులుగా గుర్తించి సభ్యత్వం కల్పించాలని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లక్ష్యమని చెప్పారు.

సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం మత్స్య సహకార సొసైటీ లకు ఎన్నికలు:

కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మత్స్యకారులకు సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందుకోసం విధివిధానాలను సిద్దం చేయాలని కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. సభ్యత్వం పొందిన వారికి ప్రభుత్వ పంపిణీ చేసే చేపలు పట్టుకోవడానికి, చెరువులపై హక్కులు కల్పించడం జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం మత్స్య సహకార సొసైటీ లకు ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.

అదేవిధంగా పిబ్రవరి మొదటి వారంలో 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 6 లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ కాగా, 4 లక్షల రూపాయలను లబ్దిదారుల వాటా గా చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. 3 నుండి 5 మంది మహిళలతో కూడిన టీం కు ఒక వాహనాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మత్స్యకార మహిళలు ఈ వాహనం ద్వారా చేపలు, చేప వంటకాలను విక్రయించు కోవడం ద్వారా స్వయం ఉపాది పొందుతారని వివరించారు. ఈ వాహనాలను జీహెఛ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో 3 చొప్పున ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =