కోవీషీల్డ్ మొదటి 100 మిలియన్ డోసులను రూ.200 లెక్కనే అందిస్తున్నాం

Adar Poonawalla about Covishield Covid-19 Vaccine, Covishield, Covishield Corona Vaccine, Covishield Coronavirus Vaccine, Covishield Covid-19 Vaccine, Covishield Covid-19 Vaccine Dispatch, Covishield Vaccince, Covishield Vaccince Distribution, Covishield Vaccince In India, First Batch of Covishield Corona Vaccine, Mango News Telugu, SII CEO Adar Poonawalla, Telangana Receives First Batch of Covishield

దేశవ్యాప్తంగా జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కు అనుగుణంగా సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ మొదటివిడత రవాణాను మంగళవారం నాడు మొదలుపెట్టింది.‌ దేశంలోని వివిధ రాష్ట్రాలకు మొదటి బ్యాచ్ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ బాక్సులు ఇప్పటికే చేరుకున్నాయి. తమ సంస్థ నుండి కరోనా వ్యాక్సిన్ రవాణా చేపట్టడం చారిత్రక క్షణమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వ అభ్యర్థన మేరకు మొదటి 100 మిలియన్ డోసులను ఒక్కోడోసుకు 200 రూపాయల ప్రత్యేక ధరకు మాత్రమే అందిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ప్రైవేట్ మార్కెట్లలో ఒక్కో డోసును 1000 రూపాయలకు విక్రయిస్తామని తెలిపారు. సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లను సరఫరా చేయమని కేంద్రానికి అభ్యర్ధనలు వస్తున్నాయన్నారు. ఇతర దేశాలకు సంబంధించి ముందుగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తమ సంస్థ ప్రతి నెల 70 నుంచి 80 మిలియన్ డోసుల ఉత్పత్తి చేయనుందని, అయితే వ్యాక్సిన్ సరఫరా చేసే అంశంపై ప్రణాళిక జరుగుతోందని సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =