మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మణిపూర్ లో సీఎం పీఠం దక్కించుకునేందుకు ఏ పార్టీ/కూటమికీ అయినా 31 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ ఇప్పటికే 28 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం మరో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. జేడీయూ 6 స్థానాల్లో, ఎన్పీపీ 6 స్థానాల్లో, ఎన్పీఎఫ్ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 5 స్థానాల్లో, కుకీ పీపుల్స్ అలయన్స్ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు.
మణిపూర్ లో బీజేపీ మళ్ళీ అధికారం దక్కించుకునేలా పూర్తి మెజారిటీ సాధిస్తుందా లేక ఇతర పార్టీల మద్దతు అవసరమవుతుందా అనేది వేచి చూడాలి. ముందుగా మణిపూర్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 28న మొదటిదశలో 38 స్థానాల్లో, మార్చి 5న రెండో దశలో భాగంగా 22 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (60): (గెలుపు+ఆధిక్యం)
- బీజేపీ: 32
- ఎన్పీపీ: 7
- కాంగ్రెస్: 5
- ఎన్పీఎఫ్: 5
- జేడీయూ : 6
- కుకీ పీపుల్స్ అలయన్స్ : 2
- ఇండిపెండెంట్: 3
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ