ఇంట్లోనే కరోనా పరీక్షలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే

ICMR Approves Home-based RAT Kit for Covid Testing and Issued Guidelines,Covid-19,ICMR Approves Home Testing Kit,Test For Covid-19 At Home And Get Result In 15 Minutes,Test For Covid-19 At Home,Covid-19 Test At Home,Test For Covid At Home,Covid-19 Home Testing Kit Approved,ICMR Issues Guidelines,ICMR Approves Covid,Covid-19 Test Kits After ICMR's Approval,Mylab,Mylab Covid 19 Rapid Test Kit,Mylab Covid Test,Mylab Covid 19 Test,Mylab Covid 19 Kit,Mylab Covid Antigen Test,Mylab Box Covid-19 At-home Viral Detection Test,Self Covid,Self Covid Nasal Swab,Self Covid Test,Self Covid Test At Home,Self Covid 19 Test,Self Covid Test Kit At Home,ICMR Guidelines,ICMR Guidelines For Covid Test,ICMR Approves Home-based RAT Kit,ICMR Approves Kit For Rapid Covid-19 Home Testing

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకునేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం తెలిపింది. ఇంట్లోకే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ప్రత్యేకంగా పూణే లోని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన కోవిసెల్ఫ్ అనే రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ ను ఐసీఎంఆర్ బుధవారం నాడు ఆమోదించింది. అలాగే ఇందుకు సంబంధించి కూడా మార్గదర్శకాలను కూడా ఐసీఎంఆర్ విడుదల చేసింది.

ఇంట్లోనే కరోనా పరీక్షలు, ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ఇవే:

  • ల్యాబ్ లో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారితో సన్నిహితంగా ఉన్నవారికి, అలాగే లక్షణాలున్న వారికీ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ సూచించబడుతుంది.
  • విచక్షణారహితంగా ఈ పరీక్షలు నిర్వహించకూడదు.
  • యూజర్ మాన్యువల్‌లో టెస్ట్ కిట్ తయారీదారు వివరించిన విధానం ప్రకారమే ఇంట్లో కరోనా పరీక్ష నిర్వహించాలి.
  • హోమ్ టెస్టింగ్ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు అందరూ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • మొబైల్ యాప్ పరీక్షా విధానం యొక్క సమగ్ర మార్గదర్శిగా ఉంటుంది, మరియు రోగికి ఇది పరీక్ష యొక్క పాజిటివ్ లేదా నెగటివ్ ఫలితాన్ని అందిస్తుంది.
  • వినియోగదారులంతా పరీక్ష పూర్తయిన తర్వాత టెస్ట్‌ స్ట్రిప్‌ను మొబైల్‌యాప్, యూజర్‌ రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ఫోన్‌లో ఫొటో తీయాలి.
  • మొబైల్‌ఫోన్‌ యాప్‌లో నమోదైన డేటా దానితో అనుసంధానించబడిన ఐసీఎంఆర్‌ కోవిడ్-19 టెస్టింగ్‌ పోర్టల్‌ యొక్క సురక్షిత సర్వర్‌లో భద్రపరచబడుతుంది. ఆ డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది.
  • రోగి గోప్యత పూర్తిగా నిర్వహించబడుతుంది.
  • ఈ పరీక్షలో పాజిటివ్‌ గా తేలిన వ్యక్తులందరికి నిజమైన పాజిటివ్‌ గానే పరిగణించవచ్చు మరియు ఎలాంటి పునరావృత పరీక్ష అవసరం లేదు.
  • పాజిటివ్ గా తేలిన వారంతా కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్‌లో ఉండాలి.
  • ఈ హోమ్ టెస్ట్ కిట్ (ర్యాట్) లో నెగెటివ్‌ వచ్చిన వారు వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. ర్యాట్‌ పరీక్షల్లో తక్కువుగా వైరస్ లోడ్ తో ఉన్న పాజిటివ్ కేసులను గుర్తించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో వెంటనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి.
  • లక్షణాలు ఉండి హోమ్ టెస్ట్ లో నెగెటివ్‌ వచ్చిన వారిని అనుమానిత కరోనా కేసులుగా పరిగణించవచ్చని, ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష ఫలితం వచ్చేవరకు కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వెంటనే ఐసోలేషన్‌కు వెళ్ళాలి.
  • టెస్ట్ కిట్, స్వాబ్ మరియు ఇతర సామగ్రిని పారవేయడానికి తయారీదారు సూచనలను ఖచ్చితంగా పాటించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =