దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత విద్యాసంవత్సరంతో పాటుగా తాజాగా ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరంపై కూడా ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలలను ఎప్పటినుంచి ప్రారంభించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారో తెలుసుకొని, వారి అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డి) విద్యా శాఖలను కోరింది. ఈ మేరకు ఎంహెచ్‌ఆర్‌డి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖ కార్యదర్శులకు లేఖలు రాసి జూలై 20 నాటికీ వివరాలు పంపాలని కోరారు.
ఈ కింది అంశాలపై పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరారు:
- పాఠశాలలు తిరిగి తెరవడానికి ఆగస్టు/ సెప్టెంబర్/అక్టోబర్ నెలలలో ఎప్పుడూ సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు?
- పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు తల్లిదండ్రుల అంచనాలు ఏంటి? పాఠశాలల నుంచి ఎలాంటి జాగ్రత్తలను కోరుకుంటున్నారు?
- పాఠశాలలు తెరవడంపై ఇంకా ఇతర అభిప్రాయాలు ఉన్నా కూడా తెలియజేయాలని కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu