రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన చర్చలు – పరిష్కారం లభించేనా?

Russia-Ukraine War Crisis Negotiation Talks Begin Between Two Countries At Belarus Border, Russia-Ukraine War Crisis, Negotiation Talks Begin Between Two Countries At Belarus Border, Belarus Border, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్-బెలారస్ సరిహద్దులో కైవ్ మరియు మాస్కో మధ్య ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయి. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ.. ఉక్రెయిన్‌కు తదుపరి 24 గంటలు ఎంతో కీలకమైన సమయంగా పేర్కొన్నారు. అయితే, రష్యా సైన్యం చేస్తున్న దాడి వేగం ప్రస్తుతం కొంత తగ్గిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఉక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య ఇప్పుడు 14 మంది పిల్లలతో సహా 352 మంది అని ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మాస్కోతో చర్చల కోసం తమ లక్ష్యం తక్షణ కాల్పుల విరమణ అని ఉక్రెయిన్ పేర్కొంది.

ఇప్పటికి యుద్ధం ఆరంభమయ్యి 5 రోజులు అవుతోంది. ఇరువైపులా నష్టం భారీగానే జరిగినట్లు  తెలుస్తోంది. ఎంతోమంది సాధారణ పౌరులు కూడా మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, మరోవైపు వేలాదిగా ఉక్రేనియన్లు పశ్చిమ దేశాలకు తరలిపోతున్నారు. అందుతున్న సమాచారం మేరకు యుద్ధం ముగిసేనాటికి ఏడు మిలియన్ల మంది వరకు స్వదేశం వదిలి పోవచ్చని ఒక అంచనా. ఇంకోవైపు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉక్రెయిన్ దేశానికి ఇంటర్నెట్ అందించటానికి ముందుకొచ్చారు. ఇప్పటికే మస్క్ కేబుల్స్ అవసరం లేకుండా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత 2,3 రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో నెట్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + ten =