బిలియనీర్, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. “నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. నేను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా మారేంత వరకు వైద్య నిపుణుల సలహాలను అనుసరిస్తూ ఐసోలేషన్ లో ఉంటాను. రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటుగా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నాను. అలాగే గొప్ప మెడికల్ కేర్ పొందే అవకాశం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను” అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.
మరోవైపు గేట్స్ ఫౌండేషన్ రెండు సంవత్సరాల తరవాత మొదటిసారిగా ఈ రోజు కలవబోతుందని, ప్రతి ఒక్కరినీ చూడటానికి మరియు వారి కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు టీమ్‌లో ఉండటం తన అదృష్టమని బిల్ గేట్స్ పేర్కొన్నారు. మనలో ఎవరూ మళ్లీ మహమ్మారిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకోవడానికి చేయగలిగినదంతా చేస్తామని, ఇతర భాగస్వాములతో కలిసి పని చేస్తూనే ఉంటామని బిల్ గేట్స్ స్పష్టం చేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ