వాక్సిన్ పై అనుమానాలు వద్దు, మొదటి టీకా నేనే వేయించుకుంటాను: ఈటల రాజేందర్

Corona Vaccination, Corona Vaccination Drive, Corona Vaccination Drive in Telangana, Corona Vaccination Updates, Etala Rajender About Corona Vaccination Drive, Mango News Telugu, Minister Etala Rajender, telangana, Telangana Corona Vaccination Drive, Telangana Corona Vaccination Drive News, Telangana Corona Vaccination Drive Updates

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వాక్సిన్ పంపిణీపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ శనివారం నుంచి ప్రారంభం కానుందని, తెలంగాణ రాష్ట్రంలో 139 సెంటర్స్ లో వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. “గాంధీ ఆసుపత్రిలో నేను, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డిఎంఈ రమేష్ రెడ్డి వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. రాష్ట్రంలో మిగతా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డోసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి సరిపోతాయి, మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు, ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కోమార్బిడిటీస్ ఉన్న వారికి, 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ వేస్తాము” అని మంత్రి పేర్కొన్నారు.

వాక్సిన్ పై అనుమానాలు వద్దు, మొదటి టీకా నేనే వేయించుకుంటాను:

“వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్ మానవ కళ్యాణం కోసం. కాబట్టి భయపడవద్దు. శాస్త్ర బద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డిసిజిఐ వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ బయోటెక్ వాక్సిన్ 3 వ రౌండ్ ట్రయల్స్ నిమ్స్ లో నడుస్తున్నాయి. అవి పూర్తి కాగానే అందుబాటులోకి వస్తుంది. రాష్ట్రంలో మొత్తం 1213 కేంద్రాలు సిద్దం చేశాము. వాక్సిన్ వేసిన తరువాత అరగంట పాటు పరిశీలనలో ఉండాలి. అందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసాము. రియాక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ, ఒక వేళ వచ్చిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం 57 సెంటర్స్ సిద్దం చేశాము. ఈ శాఖకు కెప్టెన్ గా సిబ్బందిలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసం మొదటి టీకా నేనే వేయించుకోబోతున్నాను. కోట్ల మందికి ప్రాణదానం చేసిన పెన్సిలిన్ సైతం ముందుగా పరీక్ష చేసిన తరువాతనే ఇస్తారు కాబట్టి భయపడవద్దు. కరోనా ను రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి” మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =