మరో మూడు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం : హోంమంత్రి మహమూద్ అలీ

Home Minister Mahmood Ali Inspects Police Command Control Centre Works at Hyderabad, Mahmood Ali Inspects Police Command Control Centre Works at Hyderabad, Minister Mahmood Ali Inspects Police Command Control Centre Works at Hyderabad, Police Command Control Centre Works at Hyderabad, Police Command Control Centre Works, Home Minister Mahmood Ali, Telangana Home Minister Mahmood Ali, Minister Mahmood Ali, Mahmood Ali, Mahmood Ali Home Minister Of Telangana, Police Command Control Centre Works News, Police Command Control Centre Works Latest News, Police Command Control Centre Works Latest Updates, Police Command Control Centre Works Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు పరిశీలించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తదితరులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. భవనంలోని అన్ని టవర్లను, డేటా సెంటర్లను, హెలిప్యాడ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు సమావేశమై విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పరిష్కరించేందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని మరో మూడు నెలల్లో ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పదే పదే చెప్తూ ఉంటారని, తదనుగుణంగానే నిధులను కేటాయిస్తూ ఉన్నారని అన్నారు. అదేవిధంగా పోలీసు నియామకాలను భారీ స్థాయిలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, నేరాలను అరికట్టేందుకు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ సెంటర్ ద్వారా ఒకేసారి లక్షకి పైగా సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుందని ఈ బిల్డింగ్ లో మొత్తం ఐదు టవర్స్ ఉన్నాయన్నారు. ఈ సెంటర్లో మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నామని, వీటిని విద్యార్థులు, ఔత్సాహికులు సందర్శించవచ్చనీ డీజీపీ అన్నారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ భవన నిర్మాణ పనుల గురించి వివరించారు. పోలీసుల పనితీరు మెరుగుపరిచేందుకు ప్రజా సహకారం అవసరమని పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు ,రాష్ట్ర అభివృద్ధికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. అడిషనల్ డీజీపీ జితేందర్, ఇఎన్సి గణపతి రెడ్డి, డీసీపీలు జోయల్ డేవిస్, సునీత రెడ్డి, షాపూర్జీ ప్రతినిధి లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 14 =