భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరో 8 యూట్యూబ్ ఛానల్స్, ఒక పేస్ బుక్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. ఈ ఎనిమిది యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానల్స్ లో 7 దేశీయ ఛానెల్స్ కాగా, 1 పాకిస్తాన్ కి చెందినవి ఉన్నట్టు తెలిపారు. ఐటీ రూల్స్, 2021 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించుకుని వీటిపై నిషేధ ఉత్తర్వులు జారీ చేస్తునట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించింది. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానల్స్ 114 కోట్లకు పైగా వ్యూస్ కలిగి ఉన్నాయని, అలాగే 85 లక్షల 73 వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారని చెప్పారు. బ్లాక్ చేయబడిన యూట్యూబ్ ఛానల్స్ కు ఫేక్ భారత వ్యతిరేక కంటెంట్‌తో డబ్బు ఆర్జించబడిందన్నారు.
ఈ చర్యతో డిసెంబర్ 2021 నుండి ఇప్పటికి 102 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానల్స్ మరియు అనేక ఇతర సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన, విశ్వసనీయమైన మరియు సురక్షితమైన ఆన్‌లైన్ న్యూస్ మీడియా వాతావరణాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని, దేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు మరియు పబ్లిక్ ఆర్డర్‌ను అణగదొక్కే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటుందని పేర్కొన్నారు.
దేశీయ యూట్యూబ్ ఛానల్స్ (7):
- Loktantra Tv
- U&V TV
- AM Razvi
- Gouravshali Pawan Mithilanchal
- SeeTop5TH
- Sarkari Update
- Sab Kuch Dekho
పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ ఛానెల్స్ (1):
- News ki Dunya
పేస్ బుక్ అకౌంట్ : Loktantra Tv
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY