అక్టోబర్‌ 4న స్విట్జర్లాండ్‌లో ఆసియా లీడర్స్‌ సిరీస్‌ ఫోరం సమావేశం, పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

Telangana Minister KTR Invited To Asia Leaders Series Meeting in Zurich Switzerland on October 4, KTR Invited To Asia Leaders Series Meeting in Zurich Switzerland on October 4, Asia Leaders Series Meeting on October 4, Asia Leaders Series Meeting, Zurich Switzerland, Telangana Minister KTR, KT Rama Rao, Asia Leaders Series Meeting News, Asia Leaders Series Meeting Latest News And Updates, Asia Leaders Series Meeting Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఒక ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానం అందింది. అక్టోబరు 4వ తేదీన స్విట్జర్లాండ్‌ రాజధాని జ్యూరిచ్‌లో జరుగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. దీనిలో యూరప్-ఆసియాలోని సుమారు 100 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొంటారని ఫోరం ప్రతినిధులు తెలిపారు. వీరిలో బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (ఎం16) మాజీ చీఫ్‌ సర్‌ జాన్‌ సార్లెట్‌, గోల్డ్‌మన్‌ సాచ్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ విద్యా సక్సెనా, ఎల్‌డీసీ గ్రూప్‌ చైర్‌ లార్డ్‌ జిమ్‌ ఓనీల్‌ తదితర ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.

కాగా ఈ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వివిధ రంగాల ప్రముఖులతో ఆలోచనలు పంచుకొనేందుకు ఇదొక గొప్ప వేదికని, దీనిలో పాల్గొననుండటం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో.. ఆసియా-యూరప్‌ ఖండాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితి, తద్వారా నష్టపోతున్న విస్తృత వ్యాపార అవకాశాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. యూరప్-ఆసియా కారిడార్‌లోని ప్రధాన కంపెనీలను ప్రభావితం చేయడం, చేరికను సమర్థించడం, సహకారాన్ని ప్రోత్సహించడం మరియు విశ్వసనీయతను పెంపొందించడమే లక్ష్యంగా సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో ఆలోచనాత్మక చర్చను నిర్వహించడానికి ఈ వేదిక ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − one =