మయన్మార్ దేశంలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. మయన్మార్ కీలకనేత ఆంగ్ సాన్ సూకీతో పాటు పలువురు కీలక రాజకీయ నాయకులను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఫిబ్రవరి 1, సోమవారం తెల్లవారుజామున కీలక నేతలను సైన్యం అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధంలో ఉంచిందని, ఏడాది పాటుగా అత్యవసర స్థితి కింద మయన్మార్ పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని సైన్యం ప్రకటన చేసినట్టు మయన్మార్ మీడియా వెల్లడించింది. అలాగే రాజధాని నేపిడా సహా పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఇతర సమాచార సేవలను కూడా నిలిపివేసినట్టు తెలిపారు.
గత ఏడాది నవంబర్ లోనే మయన్మార్ లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన చట్టసభ్యులు సోమవారం నాడే తోలి తొలి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆదేశ సైన్యం ఆరోపిస్తూ వస్తుంది. ఈ విషయంలో మయన్మార్ ప్రభుత్వానికి మరియు సైన్యానికి మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సైనిక తిరుబాటు జరిగినట్టు తెలుస్తుంది. గతంలో ఎన్నో ఏళ్ల పాటుగా మయన్మార్ సైనిక పాలనలోనే ఉంది. ఏళ్లపాటు గృహనిర్బంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలో ఎన్‌ఎల్‌డీ పార్టీ తొలిసారిగా 2015 లో అధికారంలోకి వచ్చింది. గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఎన్‌ఎల్‌డీ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంతో విబేధాలతో తాజాగా మరోసారి ఆదేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ