కొన్ని దశాబ్ధాల వరకు ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో పొడవాటి వ్యక్తులున్న దేశంగా అమెరికాను చెప్పేవారు. కానీ ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో పొడవాటి వ్యక్తులు ఉన్న దేశం నెదర్లాండ్స్ అవతరించింది. నెదర్లాండ్స్ ప్రజల సగటు ఎత్తు 184 సెంటీమీటర్లు.. అంటే సుమారు 6.03 అడుగులు. 18వ శతాబ్దం వరకు.. నెదర్లాండ్స్, ఐరోపాలోని కొన్ని దేశాలలో ప్రజల సగటు ఎత్తు 165 సెంటీమీటర్లు మాత్రమే ఉండేది. కానీ 200 ఏళ్లలో డచ్ ప్రజల ఎత్తు.. సగటున 15 సెంటీమీటర్లు పెరగడం నిపుణులు గుర్తించారు.
నెదర్లాండ్స్‌లో మహిళల సగటు ఎత్తు 168.5 సెంటీమీటర్లు అంటే 5.52 అడుగులుగా ఉంది. పురుషుల సగటు ఎత్తు 184 సెంటీమీటర్లు వరకు ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకు కూడా అమెరికన్లనే ప్రపంచంలోనే ఎత్తైనవారిగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు అమెరికాను నెదర్లాండ్స్ అధిగమించింది. అమెరికాలో మగవారి సగటు ఎత్తు 177.2 సెంటీమీటర్లు అంటే 5.8 అడుగులుగా ఉండగా.. మహిళల సగటు ఎత్తు 163.25 సెంటీమీటర్లు అంటే 5.3 అడుగులకు చేరుకుంది.
18వ శతాబ్దం వరకు కూడా నెదర్లాండ్స్ ప్రజలు ఎత్తు పరంగా ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉండేవారిగా పరిగణించబడ్డారని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ చెబుతోంది . అయితే ఈ 200 సంవత్సరాలలో ఊహించనిది ఏదో జరిగినట్లు అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అమెరికాను వెనక్కి నెట్టి నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది.
నెదర్లాండ్స్ ప్రజల డైలీ హ్యాబిట్స్ అధ్యయనం చేసిన కెనడాలోని లెత్‌బ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ లూయిస్ బారెట్.. డచ్ ప్రజల ఎత్తును పెంచడంలో జన్యుశాస్త్రం పాత్ర పోషించిందని తన అధ్యయనంలో తేల్చారు. వారు అంత ఎత్తుగా ఉండటానికి వారు తీసుకుంటున్న ఆహారం, పానీయాలు, నాణ్యత వంటివి చాలా కీలకంగా మారాయని తెలిపారు. వీటి కారణంగానే.. కొన్ని దశాబ్దాలుగా నెదర్లాండ్స్‌లో ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయాయని..అంతేకాకుండా అంటు వ్యాధుల కారణంగా వచ్చే మరణాల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ