స్మార్ట్ ఫోన్, కావాల్సిన డేటా ఉంటే చాలు తెలియని చోటుకు కూడా గూగుల్ మ్యాప్స్ సాయంతో ఎంచక్కా వెళ్లిపోవచ్చు. కాకపోతే కొన్నిసార్లు మ్యాప్స్‌పై విమర్శలు రావడంతో దానిని సరిదిద్దుకుంటూనే లేటెస్ట్ అప్ డేట్స్‌ను మోసుకువచ్చింది గూగుల్ కంపెనీ. తాజాగా గూగుల్ మ్యాప్స్‌ను మరింత కొత్తగా అప్‌డేట్ చేస్తుంది గూగుల్. దేశంలో ఏ ప్రాంతంను చూడాలని అనుకున్నా.. దానిని మరింత మెరుగ్గా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన సరికొత్త ఆప్షన్లను తీసుకొస్తున్నట్లు న్యూఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో గూగుల్ గురువారం ప్రకటించింది.
గూగుల్ మ్యాప్స్‌లో ఇకనుంచి స్ట్రీట్ వ్యూ, లైవ్ వ్యూ ,వాకింగ్ ఫీచర్లను అప్‌డేట్ చేయడమే కాకుండా.. మ్యాప్స్‌లో లెన్స్‌తో పాటు మరిన్ని నావిగేషన్ అప్‌డేట్‌లను తీసుకొస్తోంది. గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా వీధిని లైవ్‌లో చూసిన అనుభూతిని ఇచ్చేలా ఈ ఫీచర్ ఉండబోతోంది. అంతేకాదు ఇంకా రైలు ప్రయాణాలకు సంబంధించిన వివరాలు అంటే.. ఫ్యూయల్ ఎఫిషియెంట్ రూటింగ్, లోకల్ ట్రైన్స్ సపోర్ట్ వివరాలు, AI – ఆధారిత అడ్రస్, లొకేషన్లు వంటి వాటిని ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా తాము మ్యాప్స్‌లో మార్పులు తీసుకువస్తున్నట్లు గూగుల్ తెలిపింది
అంతేకాదు కెమెరా ఆప్షన్‌ను వాడుకుని లోకల్ ఏరియా వివరాలను కూడా నిశితంగా పరిశీలించి తెలుసుకోవడానికి సహాయపడే విధంగా.. గూగుల్ లెన్స్ అప్‌డేట్ చేశారు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్‌కు ట్రైన్స్‌కు ట్రాకింగ్ చేయడానికి వీలు కల్పించడానికి.. వేర్ ఈజ్ మై ట్రైన్ ఫీచర్‌ను ఇవ్వడం చాలామందికి ఉపయోగకరంగా ఉండబోతోంది. దీని ద్వారా ఇకపై గూగుల్ మ్యాప్స్ ద్వారా ట్రైన్స్‌ను ఈజీగా ట్రాక్ చేయవచ్చు.అయితే ప్రస్తుతానికి దీనిని ముంబై , కోల్‌కతా లోకల్ ట్రైన్స్‌కు మాత్రమే అందిస్తున్నారు. అతి త్వరలో దేశంలోని మిగతా ప్రాంతాలలో ఉన్న అన్ని రైళ్లకు విస్తరించనున్నారు.
మరోవైపు కొత్తగా తీసుకువస్తున్న లైవ్ వ్యూ వాకింగ్ నావిగేషన్ ఫీచర్‌ను దేశంలోని 3,000 కు పైగా నగరాలకు విస్తరించడానికి గూగుల్ ఏర్పాట్లు చేస్తోంది. గూగుల్‌లో కొత్తగా రాబోయే ఈ ఆప్షన్లు జనవరి 2024 నాటికల్లా అందుబాటులోకి రానున్నాయని గూగుల్ ప్రకటించింది.అయితే దీనిని ముందుగా ఆండ్రాయిడ్ యూజర్లకు విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారు. భారత దేశంలో ప్రజా రవాణాతో పాటు, పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్, వాకింగ్ లేదా సైక్లింగ్ మొదలగు డ్రైవింగ్ అనుభవాలను ..ఇకపై అందరికీ ఈజీగా ఉండేలా చూడటానికే..ఈ అత్యుత్తమైన నావిగేషన్ వ్యవస్థను అందించడానికి తాము చూస్తున్నట్లు గూగుల్ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE