ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు

Kharges Name As Prime Ministerial Candidate, Prime Ministerial Candidate, Prime Ministerial Candidate Kharges, Kharges Prime Ministerial Candidate, Indias Alliance, West Bengal CM Mamata Banerjee, Bihar CM Nitish Kumar, Former CM Akhilesh Yadav, Sonia Gandhi, Kharge, Tamil Nadu CM Stalin, Karnataka Latest Political News, Karnataka Politics, Mango News, Mango News Telugu
India's alliance, Kharge's name as prime ministerial candidate,West Bengal CM Mamata Banerjee, Bihar CM Nitish Kumar, Former CM Akhilesh Yadav, Sonia Gandhi, Kharge, Tamil Nadu CM Stalin

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు రానుండటంతో.. ప్రతిపక్ష ఇండియా కూటమి దూకుడు పెంచుతోన్నట్లే కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాలలో తాజాగా  అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. ఇక త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలపై ఇండియా కూటమి ఫోకస్ పెంచింది. తమ రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టి తమ దూకుడును ప్రదర్శించడానికి రెడీ అయిపోయింది.

కేంద్రంలో కొలువై ఉన్న  నరేంద్ర మోడీ సర్కార్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే ఇండియా కూటమి నేతలంతా ఢిల్లీలో మంగళవారం మరోసారి భేటీ అయ్యారు. హస్తినలోని అశోక హోటల్‌లో విపక్ష నేతలంతా కలిసి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తామంతా కలిసి అనుసరించబోయే వ్యూహాలపై చర్చించారు. ఈ భేటీలో టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సోనియా గాంధీ, ఖర్గే,  తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి ప్రముఖ నేతలు హాజరయ్యారు.

సీట్ల సర్ధుబాటుతో పాటు, ఎన్నికల్లో వ్యూహాత్మంగా ఎలాంటి అంశాలను అనుసరించాలంచేనే దానిపైనే కూటమి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా  ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందనే విషయంపైన కూడా  ఈ భేటీలో చర్చించారు. సుధీర్ఘ చర్చల తర్వాత  ప్రధాని అభ్యర్థిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూటమి సభ్యుల ముందు ఓ కీలక ప్రాతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ..ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును  మమతా  ప్రతిపాదించారు.అయితే మమతా బెనర్జీ ప్రతిపాదనపై కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోనే  ప్రధాని అభ్యర్థిపై ఇండియా కూటమిలోని మెజార్టీ సభ్యులంతా మరోసారి ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తమ  నిర్ణయం తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును మమతా బెనర్జీ  ప్రతిపాదించడం  పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 17 =