న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా నాటింగ్ హోమ్ లోని ట్రెంట్ బ్రిడ్జి స్టేడియంలో నేటి నుంచి (జూన్ 10, శుక్రవారం) రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గురువారం రాత్రి కేన్ విలియమ్సన్ కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టుకు దూరం అయ్యాడు.
కేన్ విలియమ్సన్ స్థానంలో కెప్టెన్ గా టామ్ లాథమ్ కు బాధ్యతలు అప్పగించగా, అతని స్థానంలో హమీష్ రూథర్‌ఫోర్డ్ జట్టులోకి వచ్చాడని న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ప్రకటించాడు. ముందుగా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న విలియమ్‌సన్ కరోనా పరీక్ష చేయించుకోగా, పరీక్షలో పాజిటివ్ గా తేలింది. దీంతో విలియమ్సన్ ఐదు రోజుల పాటుగా ఐసోలేషన్ ఉండనున్నాడు. మరోవైపు జట్టులో మిగతా ఆటగాళ్లందరికి కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY