‘టెట్‌’ పరీక్షను వెంటనే వాయిదా వేయండి.. తెలంగాణ ప్రభుత్వానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్

TPCC Chief Revanth Reddy Demands Telangana Govt TET Exam Should be Postponed Immediately, Revanth Reddy Demands Telangana Govt TET Exam Should be Postponed Immediately, Telangana Govt TET Exam Should be Postponed Immediately, TET Exam Should be Postponed Immediately, Telangana Govt TET Exam, TPCC Chief Revanth Reddy, TPCC President Revanth Reddy, TPCC Chief, Revanth Reddy, TET Exam, Telangana Govt TET Exam News, Telangana Govt TET Exam Latest News, Telangana Govt TET Exam Latest Updates, Telangana Govt TET Exam Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణలో ఈ నెల 12న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్ – 2022)ని వెంటనే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష కూడా జరుగనుందని తెలిపారు. ఆర్‌ఆర్‌బీ, టెట్‌ రెండు ఒకే రోజున ఉండడం వల్ల ఒకదానికి మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందని, దీంతో రెండు పరీక్షలు రాయాలనుకునే నిరుద్యోగులు వీటిలో ఏదో ఒకదానికి మాత్రమే హాజరయ్యే పరిస్థితి ఏర్పడుతోందని వెల్లడించారు. ఇది ఆయా అభ్యర్థులకు నిరుత్సాహం కలిగిస్తుందని, దీనికి ప్రత్యామ్నాయం చూడాలని కోరారు. ఆర్‌ఆర్‌బీ అనేది జాతీయ స్థాయి పరీక్ష కావున దానిని వాయిదా వేయడం కుదరదని, టెట్ రాష్ట్ర స్థాయి పరీక్ష కనుక మరొక తేదీన నిర్వహించకోవచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

అయితే టెట్ పరీక్షను వాయిదా వేయాలని కొద్దిరోజుల క్రితం కొందరు అభ్యర్థులు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్లను ఆయన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రీట్వీట్ చేశారు. పరీక్షల వాయిదా గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఆయన ఆ ట్వీట్‌లో కోరారు. అయితే మంత్రి సబిత దీనిపై స్పందిస్తూ.. ఎట్టిపరిస్థితుల్లోనూ ‘టెట్’ వాయిదా వేయటం కుదరదని, పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. కాగా జూన్ 12న జరగనున్న ‘టెట్’ పరీక్షకు సర్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టిక్కెట్లు కూడా విడుదలయ్యాయి. టెట్ పరీక్ష అనంతరం ఈ నెల 27న పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పుడు  తాజాగా రేవంత్ రెడ్డి ట్వీట్‌తో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =