వెంటిలేటర్‌పై పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్.. అవయవాలు పనిచేయడం లేదంటున్న కుటుంబ సభ్యులు

Pakistan Former President Pervez Musharraf on Ventilator Health Condition is Critical, Former President Pervez Musharraf on Ventilator, Pakistan Former President Pervez Musharraf on Ventilator, Pakistan Former President Pervez Musharraf Health Condition is Critical, Pervez Musharraf on Ventilator, Pakistan Former President Health Condition is Critical, Pakistan Former President on Ventilator, Pakistan Former President Pervez Musharraf, Former President Pervez Musharraf, Pakistan EX-President Pervez Musharraf, EX-President Pervez Musharraf, Pakistan Former President, Pervez Musharraf, Pervez Musharraf Health, Pervez Musharraf Health Condition, Pervez Musharraf Health News, Pervez Musharraf Health Reports, Pervez Musharraf Latest Health Condition, Pervez Musharraf Latest Health Report, Pervez Musharraf Latest News, Pervez Musharraf Latest Updates, Mango News, Mango News Telugu,

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముషారఫ్ ఆసుపత్రిలో మరణించారని ఈరోజు కొన్ని పాకిస్తానీ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ వార్తలను ముషారఫ్ కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. ముషారఫ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన శరీరం లోని కీలక అవయవాలు పనిచేయడం లేదని వారు స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ముషారఫ్ 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికన్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. ఈ మేరకు ముషారఫ్ కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో.. ‘అమిలోడోసిస్ వ్యాధితో గడిచిన మూడు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు, ఆయన అవయవాలు కూడా సరిగా పనిచేయడం లేదు, చిత్సకు స్పందించడం లేదు, దయచేసి ఆయన కోసం ప్రార్థించండి’ అని పేర్కొన్నారు.

కాగా దేశవిభజనకు ముందు 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించిన ముషారఫ్ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేసి సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. భారత్-పాక్ మధ్య జరిగిన కార్గిల్ యుద్దానికి ప్రధాన కారకుడు ముషారఫ్. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టారు. ముషారఫ్‌ను మిలిటరీ చీఫ్‌గా చేసిన నేత నవాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ఆయన 2001 నుంచి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అభిశంసనను తప్పించుకోవడం కోసం తన పదవికి రాజీనామా చేసిన ఆయన 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − four =