అదానీ చేతుల్లోకి ‘ఎన్డీటీవీ’.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు ప్రణయ్ రాయ్, భార్య రాధిక రాజీనామా

NDTV Founders Prannoy Roy and Wife Radhika Quit as Directors After Adani Group Takeover The Television Channel,NDTV Prannoy Roy Quit,Radhika NDTV Quit,Adani Group Takeover NDTV,NDTV Latest News and Updates,Mango News,Mango News Telugu,Adani Group,Adani NDTV,New Delhi Television Ltd,NDTV News and Live Updates,NDTV 24x7 Live TV,NDTV News,NDTV Latest News,Adani Power,Gautam Adani,Chairperson of Adani Group

ప్రముఖ న్యూస్ ఛానెల్ న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ‘ఆర్‌ఆర్‌పిఆర్’ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్డీటీవీలో ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్ కు ఉన్న 29.18 శాతం వాటాను గౌతమ్ అదానీ కొనుగోలు చేయడంతో వాళ్లు డైరెక్టర్స్ పదవుల నుంచి తప్పుకున్నారు. వాళ్ల స్థానంలో కొత్త డైరెక్టర్లను నియమించినట్లు ఆర్‌ఆర్‌పిఆర్ ప్రకటించింది. కాగా ఎన్డీటీవీలో ప్రస్తుతం అదానీ వాటా 55.18%కి చేరడంతో హక్కులు ఆయన సొంతమయ్యాయి. ప్రణయ్ రాయ్ మరియు అతని భార్య రాధిక రాయ్‌లు ఇప్పటికీ ఎన్డీటీవీలో 32.26 శాతం వాటాను ప్రమోటర్లుగా కలిగి ఉన్నారు. అలాగే వారు న్యూస్ ఛానెల్ బోర్డు నుండి రాజీనామా చేయలేదు.

కాగా ఇప్పటివరకు ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ చైర్‌పర్సన్‌గా మరియు రాధికా రాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక బోర్డులో నూతన డైరెక్టర్లుగా అదానీ గ్రూప్‌కు చెందిన సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా మరియు సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్‌లను తక్షణమే తీసుకురావడానికి ఆర్‌ఆర్‌పిఆర్ ఆమోదించింది. అయితే దాదాపు పదేళ్ల క్రితం క్రితం, అదానీ గ్రూప్ కంపెనీ నుండి ఆర్‌ఆర్‌పిఆర్ రూ. 400 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాన్ని తీసుకుంది. ఈ క్రమంలో రుణాన్ని చెల్లించనందున కంపెనీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేయడానికి వారెంట్లను జారీ చేశారు. అనంతరం వారెంట్‌లను ఈక్విటీగా మార్చడం వల్ల, అదానీ గ్రూప్ సంస్థకు ఆర్‌ఆర్‌పిఆర్ హోల్డింగ్స్‌లోని అధిక శాతం షేర్లను పొందింది. తద్వారా ఎన్డీటీవీపై సర్వ హక్కులు దక్కించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + seven =