కరోనా.. ఈ పేరు వినపడితే చాలు ఇప్పటికీ జనాల గుండెల్లో వణుకు పడుతుంది. దాదాపు మూడేళ్ల పాటు అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్నింటిని వల్లకాడు చేసింది ఈ మహమ్మారి. కోట్లాది మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. రూపాంతరాలు చెందుతూ.. దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేసింది. దిగ్గజ కంపెనీలే మహమ్మారి దెబ్బకు దివాలా తీశాయి. అగ్రరాజ్యాలు మహమ్మారిని తట్టుకోలేక చేతులెత్తేశాయి.
ప్రస్తుతం పరిస్థితులు అంతా బాగానే ఉన్నప్పటికీ.. మరోసారి మహమ్మారి వస్తే.. వామ్మో ఆ ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంది కదా.. కానీ రాబోయే రోజుల్లో మరో మహమ్మారిని ఎదుర్కోక తప్పదు అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా కంటే అతి భయంకరమైన మహమ్మారి ప్రపంచంపూ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇటీవల బ్రిటన్ ప్రభుత్వ మాజీ ప్రధాన సలహాదారు, శాస్త్రవేత్త సర్ పాట్రిక్ వాలెన్స్ కొత్త మహమ్మారికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
కరోనా తరహాలోనే మరో మహమ్మారి ముంచుకొస్తుందని వ్యాఖ్యానించారు. దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో ముంచుకురాబోయే మహమ్మారికి సంబంధించి ఇప్పటి నుంచే అన్ని దేశాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదని అన్నారు. అందుకోసమే మహమ్మారులను ముందుగానే గుర్తించేందుకు నిఘా వ్యవస్థలను ప్రపంచ దేశాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హే ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా హాజరయిన పాట్రిక్ వాలెన్స్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY