ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆసక్తికరంగా సాగుతున్న తెలిసిందే. ఈ క్రమంలో ఏప్రిల్ 6, బుధవారం రాత్రి ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య పూణేలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నితీష్ రాణా మరియు జస్ప్రీత్ బుమ్రాను మందలించబడ్డారు. ఈ మేరకు ఐపీఎల్ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన నితీష్ రాణాను మందలించడంతో పాటుగా అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించబడిందని పేర్కొన్నారు. నితీష్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి యొక్క లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడని, మరియు చర్యలను ఆమోదించాడని తెలిపారు.
అలాగే ఈ మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ముంబయి ఇండియన్స్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా మందలించబడ్డాడని, అతను కూడా లెవల్ 1 నేరాన్ని ఒప్పుకుని, తీసుకుంటున్న చర్యలకు అంగీకరించాడని తెలిపారు. ప్రవర్తనా నియమావళి యొక్క లెవల్ 1 ఉల్లంఘనలకు మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనదని, అందుకు ఆటగాళ్లు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. అయితే నితీష్ రాణా, జస్ప్రీత్ బుమ్రా ఏం చేశారనే దానిపై ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ