రూ.3,716 కోట్ల అదనపు రుణం పొందేందుకు ఏపీకి కేంద్రం అనుమతి

Ministry of Finance Granted Additional Borrowing Permission of Rs 3716 Cr to Andhra Pradesh, Ministry of Finance, Ministry of Finance Granted Additional Borrowing Permission to Andhra Pradesh, Ten States get additional 28204 crores, 10 states given permission to borrow additional 28204 crores, Ministry of Finance has granted additional borrowing permission of Rs 28204 crore to 10 states, Centre has granted additional borrowing permission, Union Ministry of Finance has granted additional borrowing permission of 28204 crore to 10 states, Andhra Pradesh, Assam, Himachal Pradesh, Manipur, Meghalaya, Odisha, Rajasthan, Sikkim, Tamil Nadu, Uttar Pradesh, Govt Allows to 10 States to Borrow Additional 28204 crores, Finance ministry, Union Finance ministry, Mango News, Mango News Telugu,

దేశంలో పది రాష్ట్రాలకు అదనపు రుణ అనుమతిని మంజూరు చేస్తూ కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021-22లో విద్యుత్ రంగంలో నిర్ణీత సంస్కరణలు చేపట్టినందుకు 10 రాష్ట్రాలకు రూ.28,204 కోట్ల అదనపు రుణ అనుమతిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా రూ.3,716 కోట్ల అప్పు తీసుకునేందుకు అనుమతి లభించింది

ముందుగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు విద్యుత్ రంగంలో రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా, 2021-22 నుండి 2024-25 వరకు నాలుగు సంవత్సరాల కాలానికి ప్రతి సంవత్సరం రాష్ట్రాలకు స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతం వరకు అదనపు రుణ స్థలాన్ని మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. 2021-22 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. విద్యుత్ రంగం యొక్క కార్యాచరణ, ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం మరియు చెల్లింపు విద్యుత్ వినియోగంలో స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించడం కోసం అదనపు రుణ అనుమతులుగా ఆర్థిక ప్రోత్సాహకాలను మంజూరు చేయడం ప్రారంభించారు. విద్యుత్ రంగ సంస్కరణలతో అనుసంధానించబడిన అదనపు రుణాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరి సంస్కరణల సమితిని చేపట్టాలి మరియు నిర్ణీత పనితీరు ప్రమాణాలను కూడా అందుకోవాలని పేర్కొన్నారు.

రాష్ట్రాల వారీగా అదనపు రుణాలు అనుమతి:

  1. ఆంధ్రప్రదేశ్ – రూ.3,716 కోట్లు
  2. అస్సాం – రూ.1,886 కోట్లు
  3. హిమాచల్ ప్రదేశ్ – రూ.251 కోట్లు
  4. మణిపూర్ – రూ.180 కోట్లు
  5. మేఘాలయ – రూ.192 కోట్లు
  6. ఒడిశా – రూ.2,725 కోట్లు
  7. రాజస్థాన్ – రూ.5,186 కోట్లు
  8. సిక్కిం – రూ.191 కోట్లు
  9. తమిళనాడు – రూ.7,054 కోట్లు
  10. ఉత్తర్ ప్రదేశ్ – రూ.6,823 కోట్లు
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − thirteen =