అత్యంత ఆసక్తిగా సాగిన లోక్ సభ స్పీకర్ ఎన్నికకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. 18వ లోక్ సభ స్పీకర్‌గా ఎన్డీయే బలపరిచిన అభ్యర్థి అయిన ఓం బిర్లా మూజువాణి ఓటుతో ఎన్నికయ్యారు. విపక్ష కూటమి అభ్యర్థి సురేష్‌పై గెలుపొందిన ఓం బిర్లావరుసగా రెండసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయ్యారు. రాజస్థాన్ కోటా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు .ఓం బిర్లాకు ముందుగా శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. స్పీకర్ కుర్చీలో ఓం బిర్లాను కూర్చోబెట్టారు.
నిజానికి స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగడం ఇదే తొలిసారి కావడంతో దేశ వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. ప్రతి సారీ కూడా లోక్ సభ ఎన్నికల తర్వాత స్పీకర్ ఎన్నిక జరగుతుంది. ఈ సారి బీజేపీ నేతృత్వంలోని.. ఎన్టీయే అభ్యర్థిగా ఓం బిర్లా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేసారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని అడిగినా ఎన్డీయే స్పందించకపోవడంతో స్పీకర్ పదవి ఏకగ్రీవం కాకుండా.. తమ తరుపున అభ్యర్ధిగా కే.సురేశ్‌ను నిలబెట్టారు.
లోక్ సభ స్పీకర్ ఎన్నిక కోసం ఉదయం 11 నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఓటింగ్ లో పాల్గొన్నారు. స్పీకర్ గా అయినా డిప్యూటీ స్పీకర్ గా అయినా ఎన్నికయ్యే వ్యక్తిగా విధిగా లోక్ సభ సభ్యుడై ఉండాలి. కానీ, స్పీకర్‌ను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలో నిర్దిష్టమైన అర్హత ఏది లేదు. లోక్‌సభ స్పీకర్‌గా ఎప్పుడూ అధికార పార్టీ సభ్యుడే ఎన్నుకోబడుతూ ఉంటారు. లోక్ సభ స్పీకర్ అయిన ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోనే లోక్ సభ కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి.
లోక్ సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలున్నారు. వాయనాడ్‌కు రాహుల్ గాంధీ తాజాగా రాజీనామా చేయడంతో ఒకటి ఎంపీ సీటు ఖాళీగా ఉంది. మొత్తం 542మంది ఎంపీలలో ఎన్డీయే పార్టీకి 293 ఎంపీల బలం ఉండగా.. అందులో బీజేపీకి 240 సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. లోక్ సభ అభ్యర్ధుల్లో సగానికి కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తే లోక్ సభ స్పీకర్‌గా ఎన్నిక అవుతారు. కాంగ్రెస్ పార్టీకి 98 మంది ఎంపీల బలం ఉండగా.. మొత్తం ఇండియా కూటమికి కలిపి 235 మంది ఉన్నారు. మొత్తంగా అత్యంత ఉత్కంఠ మధ్య మూజువాణి ఓటింగ్‌తో మరోసారి కూడా ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికవడంతో ఎన్డీయే వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
మరోవైపు రెండోసారి లోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా..వరుసగా రెండోసారి ఈ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా రికార్డులకు ఎక్కారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బలరాం జాఖర్ రెండుసార్లు లోక్ సభ స్పీకర్‌గా బాధ్యతలను నిర్వహించిన రికార్డు ఉంది. అలాగే అనంత శయనం అయ్యంగార్, జీఎంసీ బాలయోగి కూడా రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా ఎన్నిక అయ్యారు. అయితే బీజేపీ నుంచి మాత్రం ఎవరూ లేకపోవడంతో వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ పదవి చేపట్టిన తొలి బీజేపీ నేతగా ఓం బిర్లా రికార్డులకు ఎక్కారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE