భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు.. కర్ణాటక హై కోర్టు ఇంట్రస్టింగ్ తీర్పు

Wives Should Not be Empty at Home Karnataka High Court Interesting Verdict,Wives Should Not be Empty at Home,Karnataka High Court Interesting Verdict,Interesting Verdict on Wives at Home,Karnataka High Court,Mango News,Mango News Telugu,Wife Cannot Sit Idle Karnataka High Court,Petition in court,Single Judge Bench,Sessions Court, Supportive Maintenance,Karnataka Interesting Verdict,High Court of Karnataka News Today,Karnataka High Court Latest News,Karnataka High Court Latest Updates,Karnataka Wives at Home,Wives Should Not be Empty Latest News,Karnataka Latest News and Updates,High Court Verdict News Today

ఒక్కోసారి కోర్టుకు వచ్చిన కేసులే కాదు.. కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. తాజాగా కర్ణాటక హైకోర్టు ఓ కేసు విషయంలో ఓ విడాకుల కేసులో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ మహిళ తనకు తన భర్త ఇచ్చే భరణంలో.. కోత పెడుతున్నారంటూ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకులు తీసుకున్న భర్త.. తనకు తక్కువ భరణం ఇస్తున్నాడని ఓ మహిళ కర్ణాటక కోర్టు మెట్లెక్కెంది. విడాకుల సమయంలో మేజిస్ట్రేట్ కోర్టు.. తనకు ఇమ్మని నిర్ణయించిన భరణం కాకుండా తక్కువగా ఇస్తుండటాన్ని ఆ మహిళ సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ (Petition in court) దాఖలు చేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన కర్ణాటక ధర్మాసనం .. ఆమె భరణం తీసుకోవడానికి ఏఏ అవసరాలున్నాయో అవి ఏంటో కోర్టుకు సవివరంగా.. వివరించాలని కోరింది. ఆమె చెప్పిన వివరాలు విన్నాక.. పిటిషనర్ కు మొత్తం మెయింటెనెన్స్ ఆమె భర్తే ఎందుకు ఇవ్వాలని కోర్టు ప్రశ్నించింది. అంతటితో ప్రశ్నించకుండా ఊరుకోకుండా పిటిషనర్‌కు చివాట్లు కూడా వేసింది. అసలు ఆ మహిళ ఖాళీగా ఉండటం ఎందుకు.. జీవనోపాధి కోసం ఏదైనా పని చేసుకోవాలని కూడా సూచించింది.

‘భార్యలు ఇంట్లో ఖాళీగా ఉండకూడదు. భర్త నుంచి భరణం తీసుకునే ఆ మహిళ కూడా..తన ఉపాధి కోసం ఏదైనా పని చేసుకోవాలి’ అంటూ సూచించింది. అంతేకాదు ఆమెకు భరణం అందుకోవాల్సిన అవసరాలు ఏమిటో కూడా చెప్పాలని వెల్లడించింది. పిటిషనర్ మహిళకు సెషన్స్ కోర్టు (Sessions Court) దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ .10,000 నుంచి రూ .5,000 కు, పరిహారాన్ని రూ .3 లక్షల నుంచి రూ .2 లక్షలకు తగ్గించారు. దీంతో ఆ భరణం తనకు సరిపోదని.. సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని హైకోర్టుకు పిటిషన్ పెట్టుకుంది. ఈ పిటిషన్ ను విచారించిన.. జస్టిస్ రాజేంద్ర బాదామికర్ (Justice Rajendra Badamikar)తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ (single judge bench).. పెళ్లి తరువాత భార్య ఎందుకు పని చేయలేకపోయిందో సరైన వివరణ లేదని కౌంటర్ ఇచ్చింది.

పెళ్లికి ముందు ఆమె ఉద్యోగం చేస్తూ సంపాదించే ఆమె.. పెళ్లి తరువాత ఉద్యోగం మానివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిది. ఆమె ఖాళీగా ఇంట్లో ఉండకూడదని.. తన భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ కోరకూడదని తేల్చి చెప్పింది. ఆమె తన భర్త నుంచి కేవలం సహాయక భరణాన్ని (Supportive Maintenance) మాత్రమే కోరవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పిటిషనర్‌కు కాస్త గట్టిగానే షాక్ తగిలినట్లు అయింది. కేవలం ఈ కేసులో పిటిషనర్ అయిన మహిళ.. తన అత్తగారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండటానికి ఇష్టపడకపోవడాన్ని తప్పు బట్టింది. ఇలా చేయడం మహిళలకు తగదంటూ ఆ మహిళ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

కర్ణాటక కోర్టు తీర్పుతో సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది కోర్టు తీర్పును స్వాగతిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆ మహిళకు భలే తీర్పు చెప్పారంటూ కొంతమంది అంటుంటే.. మరికొంతమంది మహిళ పరిస్థితిపై జాలిపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 14 =