అక్టోబర్ 2న ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీ

On October 2 Prashant Kishore's New Political Party,Bihar Assembly Elections, Bihar Assembly Elections 2025, Jan Sooraj Yatra, On October 2, Prashant Kishore’s New Political Party,Mango News,Mango News Telugu,Prashant Kishore,Prashant Kishore Latest News,Prashant Kishore News,Prashant Kishore New Political Party,Bihar,Bihar News,Bihar Latest News,Bihar Political News,Bihar Assembly Elections Latest News,Prashant Kishor To Launch New Political Party In Bihar,Prashant Kishor To Launch New Political Party In Bihar On October 2

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2వ తేదీన బీహార్‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు ప్రశాంత్ కిశోర్. పార్టీ పేరు, నాయకత్వంతో పాటు అన్ని వివరాలు అదే రోజున వెల్లడిస్తానని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

జన్‌ సురాజ్‌ పేరుతో యాత్ర ప్రారంభించి రెండేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం చేపట్టిన జన్‌ సూరాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మార్చనున్నట్లు ప్రశాంత్ కిషోర్‌ గతంలోనే చెప్పారు అదే పేరుతో పార్టీ ప్రారంభ అయ్యే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనే పార్టీ తరఫున పోటీ చేస్తామని తెలిపారు.  ప్రారంభిచబోయే పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు.

మూడు ప్రధాన ఉద్దేశాలతోనే జన్‌ సురాజ్‌ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, వారి చిన్నారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, తప్పుదోవ పట్టించే నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు వేయకుండా అవగాహన కల్పించడం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే ఉద్దేశంతోనే ప్రతి గ్రామంలో పర్యటించాలని ఈ యాత్ర చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఈ యాత్ర ఇప్పటివరకు 60 శాతం పూర్తయిందని.. మిగిలిన యాత్ర కూడా కొనసాగుతుందన్నారు. రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ యాత్ర కొనసాగిందని.. పార్టీకి నాయకత్వ బాధ్యతలు తాను వహించడం లేదని పేర్కొన్నారు.

కొత్త పార్టీకి తాను నాయకుడిని కాదని, అలా ఉండాలని తాను ఎన్నడూ అనుకోలేదని ప్రశాంత్ కిషోర్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందని ఇదే సరైన తరుణమని అన్నారు. 2.5 ఏళ్ల పాటు సాగిన ప్రయాణం అక్టోబర్ 2వ తేదీన కీలక మైలురాయికి చేరుకోనుందన్నారు. ఇంతవరకూ సాగించిన ప్రయత్నాల ఫలితంగా అక్టోబర్ 2న కొత్త రాజకీయ పార్టీగా అవతరించనుందని తెలిపారు.