జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు.. శివ లింగానికి కార్బన్‌ డేటింగ్‌ పరీక్ష చేయాలన్న పిటీషన్‌ కొట్టివేత

Gyanvapi Case Varanasi Court Rejects Plea For Carbon Dating The Scientific Analysis of Shiva Ling,Gyanvapi Case Varanasi Court Rejects Plea,Security Beefed Up in Varanasi, Gyanvapi Mosque Case, Gyanvapi Mosque Case Final Verdict, Gyanvapi Case, Gyanvapi Mosque Row, Mango News, Mango News Telugu, Gyanvapi Mosque Petition Filed, Varanasi Court Verdict on Gyanvapi Mosque Case, Gyanvapi Mosque Case, Gyanvapi Mosque Court Order Today, Gyanvapi Masjid Live News, Gyanvapi Mosque Case Latest News Today, Gyanvapi Verdict Date,

ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శుక్రవారం మసీదు కాంప్లెక్స్‌లో దొరికినట్లు చెప్పబడుతున్న ‘శివ లింగం’పై కార్బన్ డేటింగ్ పరీక్ష చేయాలని కోరుతూ సెప్టెంబరు 22న దాఖలు చేసిన పిటీషన్‌ను వారణాసి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ మేరకు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎటువంటి శాస్త్రీయ విచారణకు అనుమతి ఇవ్వలేమని జిల్లా జడ్జి డాక్టర్‌ ఏకే విశ్వేషా తీర్పునిచ్చారు. మే 17న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిషన్‌కు దొరికిన వస్తువుకు రక్షణ కల్పించాల్సి ఉందని విశ్వేషా గుర్తు చేశారు. పరీక్ష కోసం రసాయనాలు ఉపయోగించబడతాయని, కావున ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లఘించడమేనని జడ్జి స్పష్టం చేశారు.

కాగా పిటీషన్‌లో.. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా ‘వజుఖానా’ సమీపంలోని కొలనులో ఈ ‘శివ లింగం’ కనిపించిందని ఫిర్యాదుదారులుగా ఉన్న నలుగురు హిందూ భక్తులు కోర్టుకు తెలిపారు. ఇది ఏ కాలం నాటిదో తెలుసుకోవడానికి శివ లింగానికి శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని వారు కోరారు. అయితే, జ్ఞానవాపి మసీదు కమిటీ అంజుమన్‌ ఇంతజామియా దీనిపై అభ్యంతరం తెలిపింది. శివ లింగం అని భావిస్తున్న ఆ దొరికిన నిర్మాణం ‘ఫౌంటెన్’కు సంబంధించిన శకలం అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా కార్బన్ డేటింగ్ అనేది ఏదేని పురాతన వస్తువు యొక్క వయస్సును నిర్ధారించడానికి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఒక శాస్త్రీయ ప్రక్రియ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 3 =