ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన భిల్వారాలో భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ 1111వ అవతార మహోత్సవంలో పాల్గొన్నారు. దేవనారాయణ్ ఆలయాన్ని దర్శించుకుని ఆవరణలో వేప మొక్కను నాటారు. అలాగే యాగశాలలో జరుగుతున్న విష్ణు మహాయజ్ఞంలో పాల్గొని పూర్ణాహుతి చేశారు. కాగా భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీని రాజస్థాన్ ప్రజలు విశేషంగా పూజిస్తారు. ఇక ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ఈ శుభ సందర్భంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తాను ప్రధానమంత్రిగా ఇక్కడికి రాలేదని, భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ ఆశీస్సులు పొందాలనుకునే యాత్రికుడిగా వచ్చానని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈరోజు దేవనారాయణ్ జీ మరియు ‘జంతా జనార్దన్’ ఇద్దరి దర్శనం పొందడం ద్వారా తన జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడి లాగే, తాను దేశం యొక్క నిరంతర అభివృద్ధి మరియు పేదల సంక్షేమం కోసం భగవాన్ శ్రీ దేవనారాయణ్ జీ నుండి ఆశీర్వాదాలు కోరుతున్నానని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇక చరిత్రలోని ప్రతీ కాలంలో సమాజంలో నుండి ఉద్భవించి ప్రతి ఒక్కరికీ మార్గదర్శక వెలుగుగా వ్యవహరించే శక్తిని కలిగి ఉండే ఒక గొప్ప వ్యక్తి జనియిస్తాడని, అలాంటి ఒక గొప్ప వ్యక్తే భగవాన్ శ్రీ దేవ్నారాయణ అని, ఆయన ఎల్లప్పుడూ సేవ మరియు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ దేవనారాయణ్ చూపిన మార్గం ‘సబ్ కా సాథ్’ ద్వారా ‘సబ్ కా వికాస్’ మరియు నేడు దేశం అదే మార్గాన్ని అనుసరిస్తోందని ప్రధాని తెలిపారు. గో మాత సేవను ఒక సామాజిక బాధ్యతగా మార్చాలనే భగవాన్ దేవ్‌నారాయణ్ ఆశయాలకు అనుగుణంగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్’ మరియు ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.
ఇంకా భారతీయ చైతన్యం యొక్క నిరంతర ప్రాచీన ప్రవాహాన్ని ప్రస్తావిస్తూ.. భారతదేశం కేవలం ఒక భూభాగం మాత్రమే కాదని, మన నాగరికత, సంస్కృతి, సామరస్యం మరియు అవకాశాల యొక్క వ్యక్తీకరణ అని ప్రధాన మంత్రి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక ఇతర నాగరికతలు నశించిపోతున్నాయని, కానీ భారతీయ నాగరికత మాత్రం విరాజిల్లుతోందని పేర్కొన్నారు. భారతదేశాన్ని భౌగోళికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా మరియు సైద్ధాంతికంగా విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఏ శక్తి కూడా భారతదేశాన్ని అంతం చేయలేదని స్పష్టం చేశారు. ఇక నీటి విలువ రాజస్థాన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని, వారి అకష్టాలు తీర్చడానికి తాము తొలి ప్రాధాన్యాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పదకొండు కోట్లకు పైగా కుటుంబాలకు మంచి నీటి కుళాయి కనెక్షన్లు అందించామని ప్రధాని మోదీ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE