ప్రయాణికుల వినోదంకై ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ ప్రారంభించిన ఎండీ వీసీ సజ్జనార్, ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీబస్సుల్లో ఏర్పాటు

TSRTC MD VC Sajjanar Launches Pilot Project of TSRTC Radio Services in 9 City Buses in Hyderabad Today,TSRTC MD VC Sajjanar,Launches Pilot Project,TSRTC Radio Services,9 City Buses in Hyderabad,Mango News,Mango News Telugu,TSRTC Radio,Tsrtc Online,Tsrtc Live,Tsrtc Online Booking,Tsrtc Bus Enquiry Number,Apsrtc,Metro Deluxe Bus,Tsrtc Rapido,Tsrtc Rapido Case,Tsrtc Rajadhani,Tsrtc Rtc,Tsrtc Rajdhani,Tsrtc Rates

ప్రయాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొన‌సాగేందుకు బస్సుల్లో ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత, ఫైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వివరాలను టీఎస్‌ఆర్టీసీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ముందుగా హైదరాబాద్ లోని బస్‌ భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ ‘టీఎస్‌ఆర్టీసీ రేడియో’ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేస్తున్న విధానం, సౌండ్‌, తదితర విషయాల గురించి టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ (ఆప‌రేష‌న్స్‌) పీవీ మునిశేఖర్‌, కూకట్‌పల్లి డిపో మేనేజర్‌ ఇషాక్‌ బిన్‌ మహ్మద్‌, మెకానికల్‌ సూపరింటెండెంట్‌ జయరాం, ఎలక్ట్రిషియన్‌ కేవీఎస్‌ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.

ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ రేడియో ప్ర‌యాణీకుల‌ను అల‌రించ‌నుంద‌ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఉప్పల్-సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌-సికింద్రాబాద్‌, గచ్చిబౌలి-మెహిదిపట్నం, సికింద్రాబాద్‌-పటాన్‌చెరువు, కూకట్‌పల్లి-శంకర్‌పల్లి, కొండాపూర్‌-సికింద్రాబాద్‌, కోటి-పటాన్‌చెరువు, ఇబ్రహింపట్నం-జేబీఎస్‌ మార్గాల్లో న‌డిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టీఎస్‌ఆర్టీసీ అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే ఈ రేడియో ద్వారా మహిళ, పిల్లల భద్రత, సైబర్‌, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు వివరించారు.

ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత, పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్‌ కోడ్ లను ఏర్పాటు చేశామని వివరించారు. ఆ క్యూఆర్‌ కోడ్ ను స్మార్ట్ ఫోన్‌లో స్కాన్‌ చేసి, రేడియోపై ఫీడ్‌బ్యాక్ ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ తీసుకువచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ స‌రికొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని ఎండీ వీసీ సజ్జనార్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =