టీమిండియా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత.. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక

Team India Star Batsman Suryakumar Yadav Named ICC Men's T20 Cricketer of The Year 2022,Suryakumar Yadav Wife,Suryakumar Yadav Stats,Suryakumar Yadav Age,Suryakumar Yadav Career,Suryakumar Yadav Videos,Suryakumar Yadav Century In T20,Ind Vs Sl,India Cricket,India Vs Sri Lanka,Suryakumar Yadav Ipl 2022,Suryakumar Yadav T20 Ranking,Suryakumar Yadav Wikipedia,Suryakumar Yadav Ipl,Suryakumar Yadav Ipl 2022 Team,Suryakumar Yadav Net Worth,Suryakumar Yadav Ranking,Mango News,Mango News Telugu

టీమిండియా బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. 2022 సంవత్సరానికి గాను ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడుగా నిలిచాడు. కాగా దీనికోసం అతడు ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్, జింబాబ్వే ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ సికందర్ రజా మరియు 2021 అవార్డు విజేత, పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించాడు. ఇక టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ.. ‘ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. 2022 సంవత్సరం నాకు అద్భుతంగా జరిగింది. ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడాను. ఇది గొప్ప అనుభూతినిస్తోంది’ అని పేర్కొన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుతమైన ఆటతీరుతో 31 మ్యాచ్ లు ఆడి 187కి పైగా స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు సాధించాడు. దీనిలో రెండు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అలాగే టీ20ల్లో ఒకే ఏడాదిలో 68 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. ఒక కేలండర్ ఇయర్ లో 1,000 పరుగులు చేసిన రెండో బ్యాటర్ గా నిలిచాడు. తద్వారా ఎన్నో మ్యాచ్ ల్లో ఇండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. కాగా 360-డిగ్రీల కోణంలో గ్రౌండ్ నలుమూలలా అద్భుతమైన షాట్లు ఆడగలగడం సూర్య ప్రత్యేకత. కాగా సూర్యకుమార్ కెరీర్‌లో అత్యధికంగా 890 రేటింగ్ పాయింట్‌లను సాధించి 2022లో ఐసీసీ టీ20 ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో సూర్య 59.75 సగటుతో, 189.68 స్ట్రైక్ రేట్‌తో 239 పరుగులు చేయడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =