ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం నాడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, చైనాతో సరిహద్దు వివాదం, తాజా ఆర్థిక పరిస్థితులు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 1 న ఇప్పటికే ఓసారి కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగగా, తాజా పరిస్థితుల దృష్ట్యా మరోసారి సమావేశమయినట్టుగా తెలుస్తుంది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu