ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మార్చి 7న ఏడవ దశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఏడో దశలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం నాడు వారణాసిలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షో కు ముందుగా ప్రధాని మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రధాని రోడ్ షో మాల్దాహియా నుండి ప్రారంభమై వారణాసి కంటోన్మెంట్, వారణాసి నార్త్ మరియు వారణాసి సౌత్ నియోజకవర్గాల మీదుగా సాగింది. రోడ్ షో మధ్యలో ఓ టీ దుకాణం వద్ద ఆగిన ప్రధాని మోదీ టీ తాగుతూ అక్కడ ప్రజలతో మాట్లాడారు.
ప్రధాని రోడ్ షోలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఓపెన్ రూఫ్ వాహనంలో నిలుచున్న ప్రధానిపై దారిపొడవునా ప్రజలు పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలు బాల్కనీలు మరియు పైకప్పులపై నిలబడి ప్రధాని వైపు చేతులు ఊపారు. రోడ్ షో ముగిసాక ప్రధాని మోదీ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ను పరిశీలించారు. రైల్వే స్టేషన్ లో ప్రజలతో, షాపులలో పనిచేసే వ్యక్తులతో ప్రధాని మోదీ సంభాషించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ