రేపు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్ అండ్ లా సెక్రటరీస్ ప్రారంభసెషన్‌లో ప్రసంగించనున్న పీఎం మోదీ .

PM Modi to Address Inaugural Session of All India Conference of Law Minister and Law Secretaries on OCT 15, Inaugural Session of All India Conference of Law Minister and Law Secretaries on OCT 15, All India Conference of Law Minister, All India Conference of Law Secretaries, Think about undertrials sympathetically, PM Modi at law ministers conference, Prime Minister Narendra Modi, PM Modi, PM Modi Speech, law ministers conference News, law ministers conference Latest News And Updates, law ministers conference Live Updates, Mango News, Mango News Telugu

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 15, శనివారం) ఉదయం 10:30 గంటలకు వీడియో సందేశం ద్వారా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్ మరియు లా సెక్రటరీస్ ప్రారంభ సెషన్‌లో ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తోంది. భారత లీగల్ అండ్ జ్యూడిషియల్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి విధాన రూపకర్తలకు ఒక ఉమ్మడి వేదికను అందించడమే ఈ సదస్సు యొక్క లక్ష్యంమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఉత్తమ విధానాలను పంచుకోవడం, కొత్త ఆలోచనలను మార్పిడి చేసుకోవడం మరియు పరస్పర సహకారాన్ని మెరుగుపరుకుంటాయని తెలిపారు.

త్వరిత న్యాయం కోసం ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ వంటి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు, మొత్తం చట్టపరమైన మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, వాడుకలో లేని చట్టాలను తొలగించడం, న్యాయానికి ప్రాప్యతను మెరుగుపరచడం, కేసుల పెండింగ్‌ను తగ్గించడం మరియు సత్వర పరిష్కారానికి భరోసా ఇవ్వడం, మెరుగైన కేంద్ర-రాష్ట్ర సమన్వయం కోసం రాష్ట్ర బిల్లులకు సంబంధించిన ప్రతిపాదనల్లో ఏకరూపత తీసుకురావడం, రాష్ట్ర న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడం సహా పలు అంశాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY