అత్యంత అధునాతనంగా కోహెడ మార్కెట్, మాస్టర్ ప్లాన్ పై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష

Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy Held Review on Koheda Market Construction, Review on Koheda Market Construction, Minister Singireddy Niranjan Reddy Held Review on Koheda Market Construction, Koheda Market Construction, Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy, Singireddy Niranjan Reddy, Telangana Agriculture Minister, Koheda Market Construction Review, Koheda fruit market, Koheda Market Construction News, Koheda Market Construction Latest News And Updates, Koheda Market Construction Live Updates, Mango News, Mango News Telugu

కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన మార్కెట్ నిర్మాణం యొక్క మాస్టర్ ప్లాన్ పై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అత్యంత అధునాతనంగా కోహెడ మార్కెట్ నిర్మాణం చేస్తామన్నారు. మార్క్ మాండ్రిడ్ (స్పెయిన్), రుంగిస్ (ఫ్రాన్స్) వంటి అధునాతన అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న వసతులు, ఉత్తమ విధానాలు పరిగణనలోకి తీసుకుని కోహెడ మార్కెట్ లో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేలము జరిగే షెడ్లలో ఊష్ణోగ్రతలు తగ్గించేందుకు మరియు ఫ్రూట్ షెల్ఫ్ లైఫ్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, సదరు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలన్నారు. మొత్తం మార్కెట్ నందు వేలం నిర్వహించుటకు 11 భారీ షెడ్ల నిర్మాణం జరపాలన్నారు. కమీషన్ ఏజంట్లు మరియు వ్యాపారస్థులకు కేటాయించుటకై (పండ్లు మరియు ఎండు మిర్చి, ఉల్లి కొరకు) 820 షాపులు నిర్మాణం చేయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కోల్డ్ స్టోరేజీల నిర్మాణమునకై 20 ఎకరాలు, పండ్ల మార్కెట్ కోసం 78.78 ఎకరాలు కేటాయించామని చెప్పారు.

“ఎగుమతుల మార్కెటింగ్ కొరకు ప్రత్యేక వసతులతో 19.75 ఎకరాలు, ఎండు మిర్చి మార్కెట్ కొరకు 27.35 ఎకరాలు, ఇతర వసతులకై 73.24 ఎకరాలు కేటాయింపు చేస్తున్నాం. మలక్ పేటలోని మిర్చి మార్కెట్ ను పూర్తి స్థాయిలో బదిలీ చేయుటకు కోహెడలో అవసరమైన వసతులు కల్పించాలని నిర్ణయించాం. మామిడి మార్కెట్ మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ఇర్రేడియేషన్ మరియు వేపర్ హీట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే, విదేశీ ఎగుమతులకు వీలవుతుంది. ఎగుమతులకు సంబంధించిన సర్టిఫికేషన్ ల్యాబులు మరియు వాటి ఆఫీసుల ఏర్పాటుకు అవసరమైన నిర్మాణం చేపట్టాలి” అని మంత్రి సూచించారు. డిటిసిపికి పంపే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటుగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eight =