ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దివస్/హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హిందీ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ప్రపంచ వ్యాప్తంగా హిందీ భారతదేశానికి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. దాని సరళత, సహజత్వం మరియు సున్నితత్వం ఎల్లప్పుడూ ఆకర్షిస్తాయి. హిందీ దివస్ సందర్భంగా, అది సంపన్నంగా మరియు సాధికారత సాధించడంలో అవిశ్రాంతంగా సహకరించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ “అధికార భాష హిందీ దేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఏకం చేస్తుంది. హిందీ అన్ని భారతీయ భాషల మిత్రుడు. హిందీతో సహా అన్ని స్థానిక భాషల సమాంతర అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. హిందీ పరిరక్షణ మరియు ప్రచారంలో కృషి చేసిన గొప్ప వ్యక్తులకు నేను నమస్కరిస్తున్నాను. అందరికీ హిందీ దివస్ శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు.
ముందుగా 1949 సెప్టెంబర్ 14న హిందీని అధికారిక భాషగా ప్రకటించారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సెప్టెంబర్ 14ను హిందీ దివస్ గా అధికారికంగా ప్రకటించారు. ఇక జనవరి 26, 1950న భారతదేశం యొక్క అధికారిక భాషగా హిందీని ఉపయోగించాలనే నిర్ణయం దేశ రాజ్యాంగం ద్వారా చట్టబద్ధం చేయబడింది. దేశంలో ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ, క్రమబద్దీకరణలో ఉపయోగించే అధికారిక భాషలలో హిందీ ఒకటిగా చేర్చబడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14న హిందీ దివస్ నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY