నూతన పార్లమెంట్‌ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

PM Narendra Modi Lays Foundation Stone for New Parliament Building,PM Launches Work For New Parliament Complex,New Parliament Building,PM Modi Lays Foundation Stone Of New Parliament Building,Narendra Modi,Modi,Prime Minister Of India,PMO India,PMO,PM Narendra Modi,PM Modi,PM Modi Speech,Pm Narendra Modi Speech,PM Of India,Pm Modi Latest Updates,India,Narendra Modi,Modi Speech Today,Parliament,Parliament Building,Foundation Stone,New Parliament Building,New Parliament,Mango News,Mango News Telugu,PM Modi Lays Foundation Stone Of New Parliament Building

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి డిసెంబర్ 10, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రాల నడుమ ప్ర‌ధాని ‌మోదీ భూమిపూజ నిర్వహించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్, కేంద్రమంత్రులు అమిత్ షా, ప్రహ్లాద్‌ జోషీ, రాజ్‌నాథ్ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, పారిశ్రామికవేత్త రతన్‌ టాటా తదితరులు పాల్గొన్నారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల్లో ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో ప్రతి ఎంపీకి ప్రత్యేక ఆఫీస్, అలాగే కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌, లైబ్రరీ, ఆరు కమిటీ రూమ్‌లు, ఎంపీల లాంజ్‌, డైనింగ్ ప్రదేశాలు, విశాల పార్కింగ్‌ స్థలం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక భవిష్యత్ లో పెరిగే సభ్యుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్ ల‌లో సిట్టింగ్ సామర్ధ్యాన్ని కూడా పెంచనున్నారు. ఇక భవన నిర్మాణాన్ని దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే ఆగస్టు 15, 2022 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ